కొద్దికాలంగా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న వారంతా మెల్లమెల్లగా టీవీ షోలలో దర్శనమిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో త్వరగా స్టార్స్ అయిపోతున్నారు. ఇదివరకు డబ్ స్మాష్, టిక్ టాక్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నవారు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో వైరల్ అవుతున్నారు. మరి సోషల్ మీడియాలో స్టార్స్ అయ్యాక ఊరికే ఊరుకుంటారా.. ప్రమోషన్స్, మోడలింగ్, ఫోటోషూట్స్ అంటూ కెరీర్ స్టార్ట్ చేస్తారు. అవన్నీ వద్దని ఊరుకున్నా.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి యూట్యూబ్ ఛానల్స్, టీవీ షోలు ఆహ్వానం పలుకుతాయి.
అలా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా నుండి టీవీ షోలలో మెరిసిన వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంతోమంది టాలెంట్ ఉన్నవారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నిర్వాహకులు. అయితే.. టాలెంట్ ఉండి సరైన సపోర్ట్ లేనివాళ్లనే ఇలా టీవీ షో స్టేజిపై ఎంకరేజ్ చేయడం చూస్తుంటాం. కానీ.. ఇలా సోషల్ మీడియా వీడియోస్ ద్వారా వెలుగులోకి వచ్చినవారిలో కొందరు తక్కువ టైమ్ లో ఫేమ్ అవుతారు.. మరికొందరికి ఫేమ్ రావడానికి ఎన్నో ఏళ్ళ సమయం పట్టవచ్చు. అలా ఓన్ టాలెంట్ తో పైకి వచ్చిన వారిపై నెటిజన్స్ కామెంట్స్ చేయడమంటే మామూలే అనుకోవచ్చు.
ఎందుకంటే.. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిపై ప్రశంసలు, విమర్శలు రావడం కొత్తేమి కాదు. కానీ.. లైఫ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ టీవీ షో స్టేజి వరకు వస్తున్నవారిపై తాజాగా జబర్దస్త్ షోలో యాంకర్ రష్మీ, కమెడియన్ నూకరాజు చేసిన కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. లైఫ్ లో ఎవరి ఎదుగుదలకైనా ఎవరో ఒకరి సహాయం, ప్రోత్సాహం అవసరం అవుతుంది. ఇప్పుడున్న రోజుల్లో అవి లేకుండా సొంతంగా పైకి రావాలంటే.. కష్టమనే చెప్పాలి లేదా ఎన్నో ఏళ్ళ జీవితం వృధా అయిపోతుందని అనుకోవచ్చు. ఇలాంటి తరుణంలో యాంకర్ రష్మీ.. సోషల్ మీడియాలో స్టార్స్ అయినవారు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై కనిపించడంపై కామెంట్ చేసింది.
ఇంతకీ యాంకర్ రష్మీ, నూకరాజు ఫన్నీ వేలో చెప్పాలనుకున్నా.. అది జనాలకు నెగటివ్ వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. తాజాగా జబర్దస్త్ వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో నూకరాజు స్టేజి పైకి వచ్చి.. “నాకు ఈ సోషల్ మీడియా అంటే చిరాకు వచ్చేస్తోందిరా.. ఎవరుపడితే వారు ఏవో వీడియోలు చేయడం, ఫేమస్ అయిపోవడం..” అన్నాడు. అంతలో యాంకర్ రష్మీ అందుకోని.. “ఆ వెంటనే శ్రీదేవి డ్రామా షోకి వచ్చేయడం” అని పంచ్ వేసింది. వీరి మాటలు నవ్వుకోడానికి బాగానే ఉండొచ్చు. కానీ.. ఇప్పటివరకు శ్రీదేవి డ్రామా షోకి వచ్చిన వారిని అవమానించినట్లుగానే రిఫ్లెక్ట్ అవుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం యాంకర్ రష్మీ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా ఫేమ్ అయినవారిలో గాజువాక కండక్టర్ ఝాన్సీ, బంగారం, నెల్లూరు కవిత, భాను, నాయని పావని ఇలా ఎంతోమంది లిస్టులో ఉన్నారు. అలాంటి వాళ్ళకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఓ స్టేజి క్రియేట్ చేసి ఫేమ్ ఇచ్చింది వాస్తవమే. కానీ.. వాళ్ళు ఫేమ్ అయినప్పుడు అభినందించిన యాంకర్ రష్మీనే ఇలా అనేసరికి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం యాంకర్ రష్మీనే జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోలతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా హోస్ట్ చేస్తోంది. చూడాలి మరి యాంకర్ రష్మీ మాటలు ఎంతవరకు వెళ్తాయో!