సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకుంటున్న యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ.. దాదాపు తొమ్మిదేళ్లపాటు షోని హోస్ట్ గా నడిపించి, ఇటీవలే షోకి గుడ్ బై చెప్పేసింది. జబర్దస్త్ లో అనసూయ గ్లామర్ లేకపోయేసరికి షోలో చేసే కామెడీని కూడా పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు అభిమానులు. ఎందుకంటే.. అనసూయ ఉంటే జబర్దస్త్ అంత కలర్ ఫుల్ గా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం.
ఇక జబర్దస్త్ యాంకర్ పొజిషన్ కి గుడ్ బై చెప్పి.. అనసూయ బయటికి వచ్చేసరికి ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అప్పటినుండి అనసూయ అసలు ఎందుకు జబర్దస్త్ నుండి బయటికి వచ్చింది? కారణం ఏమయ్యుంటుంది? అనసూయ షో నుండి బయటికి వచ్చిందా లేక వారే ఈమెను బయటికి పంపించారా? అంటూ అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. జబర్దస్త్ షోకి మొదట్లో క్రేజ్ రావడానికి కారణం అనసూయ గ్లామర్ అని కూడా చెప్పాలి.
తాజాగా తాను జబర్దస్త్ షో నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వెల్లడించింది అనసూయ. జబర్ధస్త్ షో మొదలైనప్పటి నుండి అనసూయ యాంకర్ గా వర్క్ చేసింది. అనసూయ అందచందాలు, హావభావాలు, యాంకరింగ్ షోకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలాంటి షోను బయటికి రావడం వెనుక తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. స్కిట్స్ లో భాగంగా తనపై వేసే పంచులు నచ్చడం లేదని అనసూయ చెప్పింది.
ఇక అనసూయ మాట్లాడుతూ.. “షోలో ఎన్నోసార్లు నా మీద వేసే పంచులు నచ్చక ముఖం మాడ్చుకున్నాను. అవేవీ ప్రేక్షకులకు తెలియదు. కేవలం నా మూతి విరుపులు, ఎక్సప్రెషన్స్ మాత్రమే బయటికి చూపిస్తారు. అందులో వేసే బాడీ షేమింగ్, వెకిలి జోకులకు నేను నవ్వలేను. అయితే.. క్రియేటివ్ ఫీల్డ్ అన్న తర్వాత ఇలాంటివి మామూలే అనుకుంటారు. కానీ.. ఇంకా ఊబిలో చిక్కుకుపోవాలని నేను అనుకోవడం లేదు అని చెప్పుకొచ్చింది. చివరిగా తనకు జబర్దస్త్ షో అంటే ఎంతో ఇష్టమని.. సినిమాల డేట్స్ కారణంగా జబర్దస్త్ కు సమయం కుదరడం లేదని పేర్కొంది. ప్రస్తుతం అనసూయ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.