అందగత్తె.. అందగత్తె ఏం చేస్తావ్ అంటే.. నా అందాలతో తుఫాన్ ని తరిమికొడతా, చలికి గజ గజ వణుకుతున్న అమెరికాకి అందాలతో వెచ్చదనాన్ని ఇస్తా అని అన్నదట. ఆ అందగత్తె ఎవరో కాదు, ది వన్ అండ్ ఓన్లీ ట్విట్టర్ స్టార్ అనసూయ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వృత్తిపరంగానే కాకుండా, సొసైటీకి సంబంధించిన సమస్యలపై కూడా తన గళం విప్పుతుంటుంది. అటు గ్లామర్ క్వీన్ గా, ఇటు డీగ్లామర్ క్వీన్ గా ఏ పాత్ర చేసినా అందులో క్వీన్ గా సత్తా చాటే అనసూయ.. ఇప్పుడు అమెరికాలో ఉంది. అమెరికాలోని ‘ఓషన్ స్టేట్ జాబ్ లాట్’ అనే అతి పెద్ద డిస్కౌంట్ షాపింగ్ మాల్ ముందు నిలబడి ఫోజులిచ్చింది. ఈ మాల్ లో బ్రాండెడ్ దుస్తులు, బ్యూటీకి సంబంధించిన ఉత్పత్తులు, గృహోపకరణములు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గిఫ్ట్ లు ఇలా అనేక వస్తువులు లభ్యమవుతాయి.
ఒక పక్క హరికేన్ ఇయాన్ తుఫాన్ అమెరికాని కుదిపేస్తుంటే.. అనసూయ అక్కడ రచ్చ రచ్చ చేస్తుంది. అనసూయ రాకతో దెబ్బకి తుఫాన్ పోయిందని అక్కడి వారు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారట. అసలే తుఫాన్ ప్రభావంతో చలికి గజగజ వణికిపోతుంటే.. మా తల్లే సూర్యుడ్ని వెంటబెట్టుకుని భలే వచ్చావని అంటున్నారట. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమెనే స్వయంగా వెల్లడించింది. “నేను నాతో పాటు సూర్యుడ్ని తెచ్చానని వారు అంటున్నారు” అంటూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొస్తూ.. నాలుగు ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు.. “సూర్యతాపాన్ని డామినేట్ చేసే రేంజ్ అందాలతో అక్కడ తెల్లోళ్ళకి, ఇక్కడ మనోళ్ళకి తాపం పెంచేస్తుంది. తుఫాను ప్రభావంతో చలితో వణికిపోతున్న అమెరికాకి.. సూర్యుడ్ని తీసుకెళ్లి ఉక్కబోత పెట్టిస్తోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.