లైగర్ సినిమా రిలీజ్ అయిన రోజు యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ వేడి ఇంకా చల్లారలేదు. ఒక ట్వీట్‌తో మొదలైన ఈ వార్ ఇంకా నడుస్తూనే ఉంది. విజయ్ ఫ్యాన్స్ వరుస పెట్టి రిప్లైలు ఇవ్వడం, వాటికి ఆమె కౌంటర్ ట్వీట్స్ చేయడం ఇదే కొనసాగుతుంది. అయితే కొంతమంది విజయ్ ఫ్యాన్స్ అనసూయని దారుణంగా తిడుతున్నారు. వ్యక్తిగతంగా ఆమెపై వల్గర్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. ఆంటీ అని హేళన చేయడం, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కామెంట్స్ చేయడం, అబ్యూజ్ చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో ఆమె ఆన్‌లైన్ అబ్యూజింగ్‌కి పాల్పడ్డ వారిని జైల్లో పెట్టిస్తానని హెచ్చరించారు. ఎవరైతే తనని అసభ్యపదజాలంతో తిట్టారో వారి ట్వీట్‌ని రీట్వీట్ చేస్తూ సిగ్గుపడేలా చేశారు. దీంతో కొంతమంది తమ ట్వీట్స్‌ను డిలీట్ చేశారు. కొంతమంది మాత్రం అనసూయ మీద ఇంకా ట్వీట్ల యుద్ధం ఆపడం లేదు.
నువ్వు జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడినప్పుడు, నీ మీద డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేయించుకున్నప్పుడు లేని అబ్యూజింగ్.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ మాట్లాడితే వచ్చిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి ఆమె కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. “సినిమాల్లో/టీవీలో జరిగే దానికి, నిజ జీవితంలో ఉండే దానికి తేడా గుర్తించలేని మూర్ఖులతో ఏంటి ఈ ఆవేశం, యుద్ధం అని నాకు పర్సనల్‌గా కొందరు సినీ పెద్దలు ఫోన్ చేసి అంటున్నారు. వాళ్ళ మీద గౌరవంతో కొంచెం గ్యాప్ ఇస్తున్నా. కానీ ఎవ్వరినీ తప్పించుకోనివ్వను. ఆన్‌లైన్ అబ్యూసింగ్‌కి నో చెప్పండి” అంటూ ట్వీట్ చేశారు.
సినిమాలు, టీవీ షోస్‌లో అంటే తప్పదు. నిజ జీవితంలో కూడా ఆడవారి గురించి అసభ్యకరంగా మాట్లాడకూడదు కదా. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ మాట్లాడిన డైలాగ్‌కి ఆమె వ్యతిరేకం కాదని, విజయ్ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ డైలాగ్ మాట్లాడిన దానికి వ్యతిరేకిని అని ఆమె గతంలో క్లియర్‌గా చెప్పారు. ఇప్పుడూ చెప్తున్నారు. అయినా గానీ జనం వినకుండా ఆమెను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. మరి అనసూయకి, విజయ్ ఫ్యాన్స్‌కి మధ్య జరుగుతున్న దానిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Cinemallo/TV lo jarige daaniki nija jeevitam lo unde daaniki teda gurtinchaleni murkhulato enti ee aavesham yudham ani naku personal ga kondaru cine peddalu phone chesi antunnaru..vaalla meeda respect to koncham gap istunna..but will not let anyone get away!#SayNoToOnlineAbuse
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 26, 2022