గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచార కేసులో జైలుకెళ్ళిన దోషులు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే వారిని ఒక సంస్థ సన్మానం చేయగా.. దాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఖండించారు. స్వాతంత్ర్య సమరయోధుల్లా రేపిస్ట్‌లని సన్మానించడం మన జాతికి ఒక మాయని మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ట్వీట్‍ను అనసూయ రీట్వీట్ చేస్తూ.. “దారుణం! మనం స్వేచ్ఛకు సరికొత్త నిర్వచనం ఇస్తున్నట్లు అనిపిస్తోంది.. అంటే రేపిస్టులని విడిచిపెట్టడం, ఆడవారిని ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం” అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ట్వీట్‌పై అనసూయకు నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. ఆ మధ్య హైదరాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు.
Outrageous! Looks like we are redefining freedom .. if it means letting the Rapists free and shutting the women behind the doors.. well then! #HappyIndependenceDay
Speak up India 🇮🇳 https://t.co/v5NgnJsSXN
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 18, 2022
దీనికి ఆమె స్పందిస్తూ.. తన ట్వీట్ల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఎవరి ప్రమేయంతోనో తాను ఈ ట్వీట్ చేయలేదని అన్నారు. తాను ట్వీట్ చేసింది ఏదైతే ఉందో అది పూర్తిగా తన స్వతంత్ర వ్యాఖ్య అని, సెల్ఫ్ ఇంట్రస్ట్‌తో చేసిన ట్వీట్ అని అన్నారు. తాను ఎవరినో ప్రమోట్ చేయడానికి చేయలేదని, ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని అన్నారు. ఏం జరిగిందో తనకు ఖచ్చితంగా తెలిసిన విషయాలపై మాట్లాడతానని అన్నారు. తాను పని చేసే మహిళనని, తల్లినని.. సమాజంలో జరిగే అన్ని విషయాలకు స్పందించడం కుదరదని అన్నారు.
‘Morning!! Here’s something few of you are forcing me to put which was actually meant to be by default.. A. Whatever I tweet /retweet are solely my own interest and not paid/promoted by/for anyone/anything.. B. I will speak up on things where I am sure of what happened.. (1/2)
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 19, 2022
హైదరాబాద్ మైనర్ బాలికపై అత్యాచారం గురించి మాట్లాడాలంటే ఆ సమయానికి ఆమె దగ్గర ఖచ్చితమైన సమాచారం లేదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చారు. ఒక్కోసారి తనకి సమస్య అర్ధమయ్యి స్పందించే సమయానికి ఆ సమస్య పలచబడిపోతుందని, సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండడం కష్టమవుతుందని ఆమె అన్నారు. తన ట్వీట్స్‌ని అనవసరంగా రాజకీయం చేయొద్దని ఆమె రిక్వస్ట్ చేశారు. దీంతో అనసూయ ట్వీట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచాయి. మరి అనసూయ చేసిన ఈ ట్వీట్స్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
C. I am a working woman/mother and there are many a times I end up not knowing the truth on few things which you expect me to speak up..by the time I get the time to speak up, the issue gets so diluted that it gets very difficult for me to have an opinion of my own(2/2)
— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 19, 2022