బిగ్ బాస్.. దేశవ్యాప్తంగా ఈ రియాలిటీ షోకి ఎంతో గొప్ప ఆదరణ ఉంది. అయితే మరీ ముఖ్యంగా తెలుగులో ఎంతో ప్రేక్షకాదరణ ఉంది. ఇప్పటికే 6 సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుని ఫుల్ స్వింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు స్టార్ మాలో బీబీ కంటెస్టెంట్లతో ఒక సరికొత్త ప్రోగ్రాం వస్తున్న విషయం తెలిసిందే. అదే బీబీ జోడీ. అంటే ఇప్పటివరకు బిగ్ బాస్ లో పాల్గొన్న అందరు కంటెస్టెట్ల నుంచి కొన్ని జంటలను తయారుచేసి వారితో ఒక డాన్స్ షో ప్లాన్ చేశారనమాట. ప్రస్తుతం స్టార్ మాలో ఈ షోకి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.
పర్ఫార్మ్ చేస్తోంది గత సీజన్లలో బిగ్ బాస్ లో కనిపించిన స్టార్లు కావడంతో అంతా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ షోకి రేటింగ్ కూడా బాగా వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ షోలో అఖిల్ సార్థక్- తేజశ్వి, సూర్య- ఫైమా, ఆర్జే చైతు- కాజల్, వాసంతి- అర్జున్ కల్యాణ్ ఇలా జోడీలను పెట్టారు. వారిిలో ముఖ్యంగా అఖిల్- తేజశ్వి జోడీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వారి మధ్య కెమిస్ట్రీ, ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని చెబుతున్నారు. అన్ని జోడీల్లోకి వారి జోడికి ఎక్కువ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది.
వారి ఇద్దరి పర్ఫార్మెన్స్ కి సంబంధిచి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో అఖిల్- తేజశ్వి లైగర్ సినిమాలోని జవానీ తేరీ సాంగ్ కు పర్ఫార్మ్ చేశారు. వైట్ అండ్ వైట్ లో అఖిల్, తేజశ్వి అయితే వైట్ షార్ట్ వేసుకుంది. బెడ్ పై వారు చేసిన పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ రాధ, సదాలు అయితే మాకు చెమటలు పడుతున్నాయంటూ కామెంట్ చేశారు. రాధ అయితే ఈ పర్ఫార్మెన్స్ వీడియో తీసి తన భర్తకు పంపుతానంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. అది చూసి అఖిల్- తేజశ్వి మురిసిపోయారు.
అయితే ఈ ప్రోమో చూసిన తర్వాత అభిమానులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు అది పిల్లలతో కలిసి చూసే షోనేనా అని ప్రశ్నిస్తున్నారు. డాన్స్ చేయమంటే బెడ్ పై మీరు ఆ రొమాన్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. డాన్స్ రాకపోతే రాదని చెప్పొచ్చుగా.. ఇలా హద్దులు మీరి రొమాన్స్ చేసి మార్కులు కొట్టేయాలని చూస్తున్నారా అని పెదవి విరుస్తున్నారు. ఈ ప్రోమో తర్వాత బుల్లితెరకు కూడా సెన్సార్ ఉండాల్సిందే అనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఇలాంటి పర్ఫార్మెన్స్ లు చూస్తే పిల్లలు పాడైపోతారంటూ కామెంట్ చేస్తున్నారు.