బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రోజురోజుకూ ఎన్నో వినూత్నమైన ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ని ప్రవేశపెడుతున్నారు టీవీ ఛానల్స్ వారు. ఈ క్రమంలో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఆడియెన్స్ మెప్పు పొందిన సెలబ్రిటీలను మరోసారి ఒకే స్టేజ్ పై పరిచయం చేస్తూ.. ఈసారి మరింత వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇప్పటివరకూ బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో ‘బిగ్ బాస్ జోడి’ అనే డాన్స్ షోని నిర్వహిస్తున్నారు. కొన్ని వారాల నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ షోలో.. రోజురోజుకూ కంటెస్టెంట్స్ మధ్య వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు కామెంట్స్, హర్ట్ అవ్వడం జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వచ్చే శని, ఆదివారాలలో ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు స్టార్ మా వారు. బిబి జోడిని యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా.. నటి సదా, సీనియర్ నటి రాధా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రోమో అంతా డైరెక్టర్స్ స్పెషల్ అంటూ చక్కగా మొదలైంది. తెలిసిందేగా.. ముందు సరదాగా ఉందంటే.. మున్ముందు కాంట్రవర్సీ ఉంటుందని. ఈసారి సొంత పెర్ఫార్మన్స్ లపై కాకుండా పక్కవాళ్ళ పెర్ఫార్మన్స్ లను జడ్జి చేస్తూ హర్ట్ అయిపోయారు. వాసంతి, అర్జున్ ల రొమాంటిక్ పెర్ఫార్మన్స్ తర్వాత అందరూ అభినందించారు.
అంతా బాగానే ఉందని అనుకుంటున్న టైంలో ముక్కు అవినాష్.. వాసంతి టీమ్ పెర్ఫార్మన్స్ లో డాన్స్ మిస్ అయ్యిందంటూ కామెంట్ చేశాడు. వెంటనే స్పందించిన జడ్జి సదా.. వాళ్ళు చేసింది డాన్స్ కాదా? అని అవినాష్ పై సీరియస్ అయ్యింది. పైగా అవినాష్ టీమ్ మెంబర్ అరియానా కూడా వాసంతి టీమ్ పెర్ఫార్మన్స్ పై పాజిటివ్ గానే ఉంది. దీంతో తనకు నచ్చలేదని అవినాష్.. మీకు నచ్చినట్లుగా పాయింట్స్ ఇచ్చుకోండి.. నెక్స్ట్ నుండి నేను బిబి జోడిలో ఉండను అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం వీరి వాగ్వాదానికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి అవినాష్ పై సదా సీరియస్ అవ్వడం సరైందా కాదా? అవినాష్ అలా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా? మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.