ఆమె ప్రముఖ నటి. ఎన్నో సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఇప్పుడు ఈమె భర్తనే బాత్రూంలో విగతజీవిగా కనిపించాడు. తక్షణమే ఆస్పత్రికి తీసుకెళ్లినా సరే ప్రయోజనం లేకుండా పోయింది.
మరణం ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు బాగా ఎక్కువైపోయాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు సడన్ గా చనిపోతున్నారు. అలాంటి వాటిని మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ ప్రముఖ సీరియల్ నటి భర్త కూడా ఉన్నట్టుండి విగతజీవిగా కనిపించాడు. అప్పటికప్పుడు హాస్పిటల్ కు తీసుకుపోయినప్పటికీ ఆయన చనిపోయినట్లు తేల్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు, సదరు నటి భర్తకు సంతాపం చెబుతూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సీరియల్ నటిగా చాలా ఫేమస్ అయిన నీలూ కోహ్లీ, 1995లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఆహాత్’ సీరియల్ లో తొలిసారి స్క్రీన్ పై కనిపించి ఆకట్టుకున్న ఈమె.. అప్పటినుంచి ఇప్పటివరకు 18కి పైగా సీరియల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేసింది. 1999లో ‘దిల్ క్యా కరే’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ నీలూ.. గతేడాది వచ్చిన ‘గుడ్ బై’ వరకు నటిస్తూనే ఉంది. ప్రస్తుతం మరికొన్ని సీరియల్స్, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాంటి ఈమె భర్త హర్మీందర్ సింగ్.. అకస్మాత్తుగా బాత్రూంలో చనిపోయి కనిపించారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. తాజాగా గురుద్వార వెళ్లిన హర్మీందర్ సింగ్ శుక్రవారం ఇంటికొచ్చారు. మధ్యాహ్నం టైంలో బాత్రూంకి వెళ్లారు. కానీ ఎంతసేపటికీ రాకపోయేసరికి పనిమనిషి చెక్ చేయడానికి వెళ్లింది. దీంతో ఆయన బాత్రూం గచ్చుపై విగతజీవిగా కనిపించారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు గానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు కన్ఫర్మ్ చేశారు. ఆయన కూతురు మీడియాతో మాట్లాడుతూ.. ‘అవును నాన్నగారు చనిపోయింది నిజమే. మధ్యాహ్నం టైంలో ఇది జరిగింది. ఇది హఠాన్మరణం. రెండు రోజుల్లో అంత్యక్రియలు నిర్వహిస్తాం. నాన్నకు ఇలా జరిగిన టైంలో అమ్మ ఇంట్లో లేదు. పనిమీద బయటకు వెళ్లింది’ అని చెప్పుకొచ్చింది. మరి బాత్రూంలో జారిపడి నటి భర్త కన్నుమూయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.