బుల్లితెరపై వినోదాన్ని పంచేందుకు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎన్నో పుట్టుకొస్తుంటాయి. అందులో కొన్ని ఏళ్ల తరబడి ఎపిసోడ్స్ గా కొనసాగుతుంటాయి. మరికొన్ని పండుగలు, ఏవైనా స్పెషల్ డేస్ వరకే పరిమితం అవుతుంటాయి. అయితే.. ఇప్పుడు దసరా పండుగ దగ్గర పడుతుండటంతో ప్రముఖ టీవీ ఛానల్స్ అన్ని కొత్త ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఇటీవల ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ అనే షో ప్రారంభమైంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ షో ప్రసారం కాబోతుంది. అయితే.. ఈ షోకి సంబంధించి కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ఈ ప్రోమో చూస్తుంటే చాలా సరదాగా సాగింది.. ఇక రీసెంట్ గా మొదలైంది షోలో ఇది రెండో ఎపిసోడ్ మాత్రమే. ఈ షోలో పార్టిసిపేట్ చేసేందుకు సింగర్ గీతామాధురి, హరితేజ, కమెడియన్స్ ధనరాజ్, వేణు.. యాక్టర్స్ అమిత్, భాను శ్రీ పాల్గొన్నారు. అయితే.. షోలో అన్నివిధాలుగా ఆటపాటలు ఏర్పాటు చేయగా.. ఎవరి టాలెంట్ ని వారు ఉపయోగించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జ్యూస్ పిండే టాస్క్ లో భాగంగా నటి హరితేజ ప్రదీప్ పై వేసిన సెటైర్ హైలెట్ గా మారింది. టాస్క్ లో భాగంగా గీతామాధురి.. జ్యూస్ కోసం ఇన్ని గ్లాసులెందుకు రెండు చాలుగా అనగానే.. రెండోది కిందపడి పగిలిపోతే మూడోది యూస్ అవుద్దిగా అంటాడు ప్రదీప్.
దీంతో హరితేజ జోక్యం చేసుకొని.. ‘శుభం పలకరా పెళ్లికొడకా.. అంటే” అంది. ఆ వెంటనే.. ‘అనడానికి కూడా దగ్గరలో పెళ్లికూతురు లేదమ్మా’ అని ప్రదీప్ అన్నాడు. ఆ తర్వాత డబ్బుల విషయంలో హరితేజ దగ్గర ఎక్కువ లేవని వేణు అంటాడు. గెలుస్తామని అంటున్నారు కదా అని ప్రదీప్ అన్నాడు. దీంతో ‘గెలవకపోతే మీరు ఇస్తారా’ అని వేణు అడుగుతాడు. దానికి ‘మీరు మీరు కొట్టుకొని మధ్యలో నన్నంటారేంటీ?’ అని ప్రదీప్ ప్రశ్నిస్తాడు. అలా ప్రదీప్ పై ప్రోమోలో పంచులు బాగానే పడ్డాయి. మరి ఎపిసోడ్ లో ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.