సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ఎన్నో కలలు కన్నాడు. దానికి తగ్గట్టుగానే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన అతడు రోడ్డు ప్రమాదంలో కన్ను మూశాడు. ఆ వివరాలు..
ఈమధ్యకాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు అనారోగ్యం కారణంగా మృతి చెందితే.. కొందరు ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. మరి కొందరు ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్నారు. ఇక తాజాగా ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో యువ నటుడు ఒకరు మృతి చెందారు. అతడి మృతిపై భార్య, స్నేహితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ వివరాలు..
ఏటూర్‌నాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన కుమ్మరి బాలు(32) ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. నటుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. బాలుకి ఎవరు లేకపోవడంతో.. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. ముందుకు సాగుతన్నాడు. ఈ క్రమంలో మే 18న కన్నాయిగూడెం మండలం, దేవాదుల గ్రామానికి చెందిన తన స్నేహితుడి పెళ్లికి హాజరవ్వడం కోసం బైక్ మీద హైదరాబాద్ నుంచి బయలు దేరాడు. పెళ్లి చూసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. మే 19 అర్థరాత్రి దాటిన తర్వాత యాదాద్రి సమీపంలోకి వచ్చిన తర్వాత బైక్ అదుపు తప్పి యాక్సిడెంట్ అయ్యింది.
ఈ ప్రమాదంలో బాలు బైక్.. చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బాలు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించాడు. బాలు భార్యను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఇండస్ట్రీలో ఎదగాలని భావిస్తోన్న బాలు.. ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు అతడి గ్రామస్తులు. బాలు మృతి వార్త తెలిసి కన్నీటి పర్యంతం అవుతున్నారు.