స్టార్ హీరోలకు చెల్లిగా నటించిన ఈ నటి.. రియల్ లైఫ్ ఇన్ని కష్టాలు దాటిందా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించిన వారిలో వరలక్ష్మి పేరే గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఆమెను ఎక్కువగా చెల్లెలి పాత్రలో తీసుకునేవారు. ఆ తర్వాత అదే స్థాయిలో చాలా తక్కువ మంది పేరు తెచ్చుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 09:26 PM IST

సినీ ఇండస్ట్రీలో హీరోలకు చెల్లెలి పాత్రలో నటించి మెప్పించిన నటీమణులు ఎంతోమంది ఉన్నారు. అప్పట్లో వరలక్ష్మి స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించి చెల్లెలు అంటే ఇలా ఉండాలి అన్నంత గొప్పగా నటించి మెప్పించింది. తర్వాత ఆ స్థాయిలో నువ్వే కావాలి ఫేమ్ వర్ష హీరోల చెల్లెలుగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. వెండితె, బుల్లితెరపై నటీమణులు ఎంతో హుందాగా, సంతోషంగా కనిపిస్తుంటారు.. కానీ వారి జీవితంలో ఎన్నో కష్టలు ఉంటాయి. ఈ విషయాలు స్వయంగా నటీనటులు పలు ఇంటర్వ్యూలో వెల్లడిస్తుంటారు. నటి వర్ష రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం..

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోల చెల్లెలి పాత్రలో నటించి చెల్లెలు అంటే ఇలా ఉండాలి అన్నంతగా ప్రేక్షకాదరణ పొందింది నటి వర్ష. ఆమె అసలు పేరు మాధవి. పుట్టి పెరిగింది హైదరాబద్. 1997 లో పంజరం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎడ్యూకేషన్ పూర్తయిన తర్వాత 1998 లో మోహన్ బాబు నటించిన ఖైదీగారు మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. 2000 సంవత్సరంలో తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో వర్ష పేరుతో నటించింది.. ఇండ్ట్రీలో అదే పేరు తో కొనసాగాలని పలువురు సూచించడంతో అదే పేరుతో కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ తర్వాత సుస్వాగతం, గిల్లి కజ్జలు, సూర్యవంశం, సుప్రభాతం , ఆహా..!, తమ్ముడు, నువ్వే కావాలి, యువరాజు, నువ్వు వస్తావని అలా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఆమె చివరి చిత్రం 2005లో వచ్చిన నాయకుడు. నేనపిరాలి అనే కన్నడ మూవీలో కూడా నటించింది.

వర్ష ఇండస్ట్రీలో పలు క్యారెక్టర్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్న సమయంలో బుల్లితెరపై కూడా ఛాన్సులు వచ్చాయి. ఈ క్రమంలో కురుక్షేత్రం, మిస్సమా, లోగిలి, తొలి ప్రేమ, సుందరకాండ, మనసు మమత, అత్తారింటికి దారేది, కస్తూరి, మట్టిగాజులు, మల్లి లాంటి సీరియల్స్ లో నటించింది. వర్ష నటించిన మనసు మమత సీరియల్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. వర్ష ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకు వివాహం జరిగింది. భర్త యానిమేషన్ కంపెనీకి అధినేత. వర్షకు ఇద్దరు పిల్లలు.. వారి బాగోగులు చూసుకునేందుకు నటనకు విరామం ఇచ్చింది.

ఈ క్రమంలోనే భర్త యానిమేషన్ కంపెనీ నష్టాల్లో కూరుకు పోయింది.  కొంతకాలం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వర్ష జుంబా ఫిట్ నెస్ సెంటర్ మొదలు పెట్టింది.. తానే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది. అధిక బరువుతో బాధపడేవారికి తమ ఫిట్ నెస్ సెంటర్లో సరికొత్త పద్దతుల ట్రైనింగ్ ఇవ్వడంతో ఫిట్ నెస్ సెంటర్ అతి కొద్దికాలంలో బాగా పాపులర్ అయ్యింది. తనకు మంచి ఛాన్సులు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ చేసేందుకు సిద్దం అంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed