ఇప్పుడు లగ్జరీ లైఫ్, స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలబ్రిటీలు ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడ్డవాళ్లే. తినడానికి తిండి లేక పస్తులుండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఖాళీ కడుపుతోనే నిద్రపోయేవారు ఉంటారు. అయితే ఒక నటి కూడా ఇలాంటి దీనస్థితి నుంచి వచ్చింది.
సినిమా రంగం అనేది గ్లామర్ ప్రపంచం. కానీ ఆ రంగుల ప్రపంచంలో అడుగుపెట్టాలంటే అంత సులువేమీ కాదు. పేదరికాన్ని, దరిద్రాన్ని, దురదృష్టాన్ని ఇలా మనిషిని ఆపే ఎన్నో ప్రతికూల పరిస్థితులను దాటుకుని వెళ్ళాలి. ఈ క్రమంలో తిండి ఉండదు, పడుకోవడానికి జాగా ఉండదు, సరైన నిద్ర ఉండదు. జీవితంలో చాలా ఉండవు. కానీ ఇవన్నీ దాటుకుని కష్టపడి ప్రయత్నించిన రోజున గెలుపుతో పాటు ఒకప్పుడు లేనివన్నీ వస్తాయి. ఇవాళ స్టార్లుగా ఉన్న సెలబ్రిటీలు ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుంచి ఏ లోటు లేదు అనే స్థితికి ఎదిగారు. తాజాగా ఓ నటి కూడా ఇలాంటి అనుభవాన్ని చవిచూసింది. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఆకలితో నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి.
ఆమె ఒక టీవీ సీరియల్ నటి. తొమ్మిదేళ్ల వయసులో గృహ హింసను కళ్లారా చూసింది. ఆమె తండ్రి అమ్మను చావ కొట్టేవాడు. అమ్మ మాత్రం ఒక ఆట ఆడుతున్నామని చెప్పేది. వెళ్లి కారులో పడుకుందామని తీసుకెళ్లేది. అలా ఖాళీ కడుపుతో కారులో నిద్రించిన రోజులు చాలానే ఉన్నాయని నటి స్నేహల్ రాయ్ తెలిపింది. ఇష్క్ కా రంగ్ సీరియల్ లో నటించిన స్నేహల్ రాయ్ ప్రస్తుతం మోడల్ గా, యాంకర్ గా కూడా రాణిస్తోంది. కాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. నాన్న అమ్మను విపరీతంగా కొట్టేవాడని, 9ఏళ్ల వయసులో గృహ హింసను చూశానని వెల్లడించింది.
నాన్న కొడుతుంటే అమ్మ అది ఆట అనేదని, దెబ్బలు కనిపించకుండా అమ్మ కవర్ చేసేదని ఆమె వెల్లడించింది. నాన్న అమ్మను కొడుతున్న విషయం తమకు అర్థమయ్యేది కాదని, అయితే ఆ నరకం నుంచి బయట పడేందుకు ఆమె అమ్మ ఒక రోజు కఠిన నిర్ణయం తీసుకుందని స్నేహాల్ వెల్లడించింది. తనను, తన చెల్లెలిని తీసుకుని ఆమె తల్లి ఇంట్లోంచి బయటకు వచ్చేసిందని, అప్పుడొక కొత్త జీవితాన్ని ప్రారంభించిందని ఆమె తెలిపింది. ఆ సమయంలో ఎన్నో కష్టాలను పడ్డామని.. ఉండడానికి ఇల్లు లేకపోతే ఒక బస్తీలో ఉన్నామని పేర్కొంది. తినడానికి తిండి ఉండేది కాదని.. కేవలం పానీపూరీ తిని ఆ నీళ్లు ఎక్కువగా తాగి కడుపు నింపుకునేవాళ్లమని ఆమె వెల్లడించింది.
ఖాళీ కడుపులోనే నిద్రపోయేవాళ్లమని ఆమె వెల్లడించింది. 16 ఏళ్ల వయసులోనే పని చేయడం మొదలుపెట్టానని.. ఉదయం సెలూన్ లో రిసెప్షనిస్టుగా, సాయంత్రం కాల్ సెంటర్ లో పని చేసేదాన్నని ఆమె తెలిపింది. ఈ క్రమంలో స్కూల్ కి తరచూ వెళ్లలేకపోయేదాన్నని, తన పరిస్థితి అర్థం చేసుకుని టీచర్లు అటెండెన్స్ వేసేవారని వెల్లడించింది. తన తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని అమ్మను చేరదీశాడని ఆమె పేర్కొంది. తన తండ్రి క్షమాపణలు అడక్కపోయినా.. తాము క్షమించమాని.. మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా అని వెల్లడించింది. మరి చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించిన ఈ నటిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.