ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఏ విషయాన్నైనా ముందుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీలు సోషల్ మీడియా విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. తాజాగా పాపులర్ సీరియల్ నటి ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసి ఫోటోలు షేర్ చేస్తూ.. తన సంతోషాన్ని పోస్టులో వెలిబుచ్చింది. ఇంతకీ ఆ నటి ఎవరా అని ఆలోచిస్తున్నారా? నటి రూపాలి గంగూలీ. హిందీలో సీరియల్ నటిగా రూపాలి చాలా ఫేమస్. మొదట సినిమాలలో నటించినా.. దాదాపు ఇరవై ఏళ్లుగా సీరియల్స్ లో రాణిస్తోంది. అలాగే బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 1లో పార్టిసిపేట్ చేసింది రూపాలి.
ఈ క్రమంలో తాజాగా రూపాలి ఖరీదైన వైట్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారు కొని ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. తాను కారు కొన్ని విషయాన్నీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజెప్పింది. ఆమె షేర్ చేసిన వీడియో చూస్తే.. షోరూమ్ లోనే భర్త అశ్విన్ వర్మ, తనయుడు రుద్రాంశ్ వర్మలతో కలిసి కేక్ కట్ చేసింది రూపాలి. ఆ తర్వాత పూజ చేసి.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, తన టీమ్ తో కొన్ని మెమోరీస్ ని వీడియోలో షేర్ పోస్ట్ చేసింది. అలాగే తన పోస్ట్ లో “జై మాతాడి జై మహాకాల్. నా కలను నిజం చేసినందుకు అందరికి ధన్యవాదాలు” చెప్పుకొచ్చింది రూపాలి. ప్రస్తుతం రూపాలికి నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక రూపాలి కొన్న కారు విలువ సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. మొదట దో ఆంఖే బార హాత్, అంగారా లాంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన రూపాలి.. తర్వాత కొంతకాలానికి సీరియల్స్ లో ప్రవేశించింది. సీరియల్స్ లోకి వచ్చాక సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ లో మోనిషా క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ‘బా బహూ ఔర్ బేబీ’, పర్వర్రిష్ – కుచ్ ఖట్టీ కుచ్ మీతీ సీరియల్స్ తో పాటు ప్రస్తుతం స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతున్న ‘అనుపమ’ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మరి రూపాలి కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ కారు గురించి, ఆమె సీరియల్స్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.