సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్త అయినా ఇట్టే వైరలవుతోంది. ఇక వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఓ నటి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని.. అందరికి షాక్ ఇచ్చింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలంటే అభిమానులే కాదు సామాన్యులు కూడా ఆసక్తి చూపుతారు. మరీ ముఖ్యంగా వారి వివాహం, వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని ఉత్సాహపడతారు. ఇక సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు చాలా త్వరగా అభిమానులకు చేరుతున్నాయి. సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియా వారధిగా నిలుస్తోంది. నేటి కాలంలో సామాన్యుల ఇళ్లల్లో జరిగే వివాహాలే ఎంతో ఆడంబరంగా జరుగుతున్నాయి. అలాంటిది.. సెలబ్రిటీల పెళ్లి అంటే మాటలా.. చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం.. చాలా సీక్రెట్‌గా, సింపుల్‌గా పెళ్లి పీటలు ఎక్కి.. ఆ తర్వాత తమ మ్యారేజ్ ఫొటోలు షేర్ చేసి.. షాకిస్తారు. ఇక తాజాగా టాలీవుడ్ బుల్లి తెర నటి ఒకరు ఇలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. అది కూడా విదేశాల్లో. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
ప్రియాంక నల్కారి.. తెలుగు వారికి సుపరిచితం. బాలనటిగా పలు సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత కూడా కొన్ని సీరియల్స్‌లో కీలక పాత్రల్లో నటిస్తూ గుర్తింపు పొందింది. ఈటీవీ ప్లస్‌లో ప్రసారం అయిన ‘సినిమా చూపిస్తా మామ’ షోకి జబర్దస్త్ శ్రీనుతో కలిసి యాంకర్‌గా సందడి చేసింది. కానీ ఆ షో పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో.. ప్రియాంకకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగులో సరైన అవకాశాలు లభించకపోవడంతో.. చివరికి ఆమె తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె తమిళ్‌లో నటిస్తోన్న రోజా సీరియల్.. అక్కడ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంది. దాంతో ప్రియాంక పాపులారిటీ కూడా విపరీతంగా పెరిగింది.
ఈ క్రమంలో ప్రియాంక గురువారం అనగా మార్చి 23న పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించి వ్యక్తితో ఎలాంటి ఆడంబరాలు లేకుండా.. చాలా సింపుల్‌గా గుడిలో వివాహం చేసుకుంది. ఆ తర్వాత.. #JustMarried అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. ఆ ఫొటోలను చూసిన ఫాలోవర్లు.. ఇంత సడెన్‌గా.. అందులోనూ సీక్రెట్‌గా వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది అంటూ ఆరా తీస్తూనే ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రియాంక తన ఇన్‌స్టా స్టేటస్‌లో కూడా పెళ్లికి సంబంధించిన ఫొటో, వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాక ప్రియాంక తన కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ఈ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మలేషియాలోని మురుగన్ ఆలయంలో ప్రియాంక పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
ప్రియాంక స్వస్థలం హైదరాబాద్. 2010లో విడుదలైన ‘అందరి బంధువయా’ మూవీలో నటిగా పరిచయమైంది. తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లో నటించింది. ఇక ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి విషయానికి వస్తే.. అతడి పేరు రాహుల్ వర్మ, బిజినెస్ మ్యాన్ అని తెలిసింది. ఇతడు కూడా తెలుగులో పలు సీరియళ్లో నటించాడని, అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. అంతేకాక వీరికి 2018లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. అదే సమయంలో ప్రియాంక టీవీ సీరియళ్లలో బిజీగా ఉండటంతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది.
దాంతో రాహుల్ ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుని మలేషియా వెళ్లిపోయాడని సమాచారం. ఈ క్రమంలోనే ప్రియాంక మలేషియా వెళ్లి.. తను ప్రేమించిన వాడిని మనువాడింది. ఇక ప్రస్తుతం ప్రియాంక తమిళంలో సెటిలైంది. ‘సన్ టీవీ’లో ప్రసారమయ్యే ‘రోజా’ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. అలాగే జీ-తమిళ్‌లో ప్రసారమయ్యే ‘సీతారామన్’ సీరియల్‌లో కూడా నటిస్తోంది.