జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే.. మూలాలను మర్చిపోవద్దు అంటారు. సొంతగడ్డపై ప్రేమ ఉండాలంటారు. లేకపోతే.. విశ్వాసంలేని వారికింద జమకడతారు.. విమర్శిస్తారు. సామాన్యులు మూలాలు మర్చిపోయి ప్రవర్తిస్తే.. ఎవరు పట్టించుకోరు. కానీ సెలబ్రిటీలు అలా ప్రవర్తిస్తే.. మాత్రం జనాలు ఊరుకోరు. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు. హీరోయిన్ రష్మిక మందన విషయంలో అదే జరిగింది. తన క్రేజ్‌తో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. వివాదాల విషయంలో కూడా అలానే ఉంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార సినిమాను.. తాను చూడలేదని చెప్పడం.. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో… తన ఫస్ట్ ప్రొడక్షన్ కంపెనీ పేరు కూడా చెప్పకుండా రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టిలను చులకనగా చేసినట్టు మాట్లాడేసింది. దాంతో రష్మికపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓ స్టేజ్‌లో ఆమెను కన్నడనాట బ్యాన్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఆ తర్వాత రష్మిక.. ఏవో తంటాలు పడి.. వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
‘‘మీడియా అడిగినప్పుడు నేను కాంతారా సినిమా చూడలేదు.. ఇప్పుడు చూశాను.. నాకు నచ్చింది.. అదే విషయాన్ని టీంకు మెసెజ్ చేసి చెప్పాను.. థాంక్యూ అని వారు కూడా రిప్లై ఇచ్చారు.. ఇప్పటి వరకు అయితే నన్ను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు. ఇక జనాలు నా వ్యక్తిగత జీవితం గురించి చేసే కామెంట్స్ కన్నా.. వర్క్ పరంగా చేసే కామెంట్స్‌నే పట్టించుకుంటాను. ఎందుకంటే నేను వారిని ఎంటర్టైన్ చేయాలని భావిస్తుంటాను’’ అని ఏవో చెప్పుకొచ్చి.. వివాదానికి ముగింపు పలకాలని ట్రై చేసింది రష్మిక.
మరి గత అనుభవంతో ఏమైనా జాగ్రత్తగా ఉందా అంటే లేదు.. మరోసారి తన నోటి దురుసుతో.. ఇంకో వివాదంలో చిక్కుకుంది. మొన్న కన్నడ ప్రజల ఆగ్రాహావేశాలకు లోనయ్యేలా కామెంట్స్ చేసి.. అభాసుపాలైన రష్మిక.. ఇప్పుడు ఏకంగా మొత్తం సౌత్ ఇండస్ట్రీనే కించపరుస్తూ కామెంట్స్ చేసింది. దాంతో మరోసారి నెటిజనులు చేతిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ దిగ్గజాలంతా.. సౌత్ వైపు చూస్తుంటే.. రష్మిక మాత్ర.. బాలీవుడ్ బెస్ట్.. సౌత్ వేస్ట్ అన్న రీతిలో కామెంట్స్ చేసి.. కాంట్రవర్సీ రాజేసింది.
తాజాగా రష్మిక.. తాను నటించిన మిషన్ మజ్ను సినిమా ప్రమోషన్స్ సందర్భంగా.. బాలీవుడ్ సాంగ్స్, సౌత్ సాంగ్స్ మధ్య పోలికలు చెప్తూ.. మరో వివాదాన్ని క్రియేట్ చేసింది. రొమాంటిక్ సాంగ్స్ తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్ అని.. సౌత్‌లో ఎక్కువగా మాస్, మసాలా కమర్షియల్, ఐటెం నంబర్స్ ఉంటాయని కించపరుస్తూ.. మాట్లాడింది. తాను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ చూస్తూ పెరిగానని అన్నది. దాంతో నెటిజనులు మరోసారి ఆమెపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
కన్నడ నుంచి సౌత్‌కు వచ్చాక.. కన్నడను తక్కువ చేసిన మాట్లాడావ్.. ఇప్పుడు దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన తరువాత సౌత్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నావ్. దీన్నే తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటారు. నీ దృష్టిలో అసలు సౌత్ సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ లేవా.. ఇక్కడి వాళ్లు రోమాంటిక్ పాటల్ని తీయలేరా.. బాలీవుడ్ వాళ్లంతా ఇప్పుడు సౌత్ జపం చేస్తుంటే.. నీకు మాత్రం బాలీవుడ్డే బెస్టా.. అసలు నీకు ఇంత గుర్తింపు దక్కిందే సౌత్ వల్ల.. ఆ సంగతి మర్చిపోకు అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. మరి రష్మిక తీరు సరైందేనా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
After #RashmikaMandanna Got Chance To Act In Bollywood, Now She Is Blaming And Downgrading Our South Industry! She Did The Same Thing To #Kannada Industry When She Got Offer In #TFI. What An Woman🙏🤮
Moral: Once A Cheater, Always A Cheater!#Yash19 #Kichcha46 #Salaar #RRR2 pic.twitter.com/tCqzARPR7X
— Box Office – South India (@BoSouthIndia) December 28, 2022