తెలుగు టీవీ ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో పై ఒకప్పుడు ఉన్నంత అభిమానం.. రానురాను బొత్తిగా తగ్గుముఖం పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే.. జబర్దస్త్ మొదలైన టైంలో ఆ స్కిట్స్, పంచులు చాలా సహజంగా, ఎలాంటి వల్గారిటీ లేకుండా ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరి స్కిట్ చూసినా డబుల్ మీనింగ్ డైలాగ్స్, పాత చింతకాయ ఐడియాలు చేస్తున్నారని.. తెలుగు ప్రేక్షకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
జబర్దస్త్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత హైపర్ ఆది. ఎవరి స్కిట్లకి వారి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో హైపర్ ఆది స్కిట్స్ లో ద్వంద్వార్థాలు వినిపిస్తుండటంతో కొన్నిసార్లు స్కిట్స్ పై ఇంటరెస్ట్ కూడా శృతి తప్పటాలు జరుగుతోంది. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్స్ అంటే మంచి ఆరోగ్యకరమైన పంచులు, కామెడీ ఎక్సపెక్ట్ చేస్తారు జనాలు.
ఇటీవల ఆ క్వాలిటీ తగ్గిందంటూ టాక్ నడుస్తుంది. టాక్ ఏంటి.. అందుకు స్కిట్లే సాక్ష్యంగా ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. తాజాగా హీరో రాజశేఖర్, జీవిత గెస్టులుగా వచ్చిన ఎపిసోడ్ లో హైపర్ ఆది పంచులు కాస్త గాడి తప్పాయి. శోభనం కాన్సెప్ట్ ఆడియో టీమ్ స్కిట్. మరి ఆది శోభనం, సంసారాల పై ఏ రేంజిలో చెలరేగిపోతాడో తెలిసిందే.
ఎప్పట్లాగే స్కిట్ మొదలైంది. మధ్యలో యాంకర్ అనసూయ నాకో డౌట్ అంటూ.. ‘శోభనం గదిలో ఫ్రూట్స్ ఎందుకు పెడతారు?’ అని అడిగింది. వెంటనే ఆది.. ‘తినాలనుకున్నవి తినలేక, దొరికినవి తినలేక.. తిన్నా సంతృప్తి లేక.. సర్లే ఏవో ఒకటని మిగిలినవి తినడానికి ఫ్రూట్స్ పెడతారు’ అన్నాడు. ఈ డైలాగ్ విని అనసూయ నోటమాట రాలేదు. అలాగే కావాల్సినవారికి కావాల్సినన్ని అర్థాలు వెతుక్కోవచ్చు.
‘ఈ మాత్రం దానికే లైట్లు ఆర్పడం దేనికి.. ఎప్పుడు తింటాను అనటమే ఇప్పుడు తినొచ్చు కదా.. మంచం మీద వేస్తావా? ఆల్రెడీ మంచాన పడ్డ మిమ్మల్ని ఎవరే మంచం మీద వేసేది’ లాంటి డైలాగ్స్ అటు రోజా, మనో తలపట్టుకునేలా చేశాయి. ఇటు ఫ్యాన్స్ కి ఇబ్బంది కలిగించాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదంతా ఏంటంటే.. యాజమాన్యం చెప్పినట్లే ఆది చేస్తాడంటూ సర్ది చెప్పుకుంటున్నారు. మరి జబర్దస్త్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.