హీరోహీరోయిన్స్, సెలబ్రిటీలపై ట్రోలింగ్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. కొందరు దీన్ని పట్టించుకుని కౌంటర్స్ ఇస్తారు. మరికొందరు మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తారు. టాలీవుడ్ మాత్రమే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ ఈ సమస్య ఉంది. ఇక తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్ శ్రుతిహాసన్ ని కూడా పలువురు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఫిజిక్, బాయ్ ఫ్రెండ్ విషయంలో గతంలో ఇలానే ట్రోల్ చేస్తే.. ఇప్పుడు మరోసారి మరో విషయంలో ట్రోల్ చేశారు. దీంతో ఆమె సైలెంట్ గా ఉండిపోకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా ఎక్కడ అవకాశమొచ్చినా సరే చేస్తూ పోయింది. ఇక ప్రస్తుతం శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేసిన రెండు తెలుగు సినిమాలు.. సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ ఉన్నాయి. ఈ రెండింటిలోనూ ఆమెనే హీరోయిన్. అలానే రోజు వ్యవధిలో ఈ రెండు మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి.
దీంతో శ్రుతిహాసన్ ఫుల్ జోష్ లో ఉంది. ఇవి హిట్ అవుతాయని, తన రేంజ్ పెరుగుతుందని భావిస్తుంది. ఇలాంటి టైంలో కొందరు ఈమెని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. రెట్టింపు వయసున్న హీరోలతో యాక్ట్ చేస్తున్నావ్.. ఛాన్సుల్లేవా? డబ్బు కోసమా? అని ఈమెని విమర్శిస్తున్నారు. ఇక దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శ్రుతి.. ఇండస్ట్రీలో వయసు అనేది నంబర్ మాత్రమే, టాలెంట్, ఎనర్జీ ఉంటే చనిపోయే వరకు కూడా యాక్ట్ చేయొచ్చు అని చెప్పింది. ఇంతకు ముందు పలువురు హీరోలు తమ వయసులో సగం ఉన్నహీరోయిన్లతో నటించి నిరూపించారు. తానేమి ఇందుకు అతీతం కాదని చెప్పుకొచ్చింది. మరి శ్రుతిహాసన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.