ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీ హోదాలను ట్రోల్స్ ద్వారా అందుకుంటున్నారు. అలా ట్రోల్స్ ద్వారా పాపులర్ అయినవారిలో యాటిట్యూడ్ స్టార్ ఒకరు. ఇంతకీ యాటిట్యూడ్ స్టార్ అంటే ఎవరో తెలుసు కదా.. బుల్లితెర నటుడు, దర్శకుడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్. ఈ పేరు వింటే గుర్తుపట్టకపోవచ్చు. కానీ.. ప్రభాకర్ కొడుకు అని చెబితే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే.. చంద్రహాస్ మూవీ అనౌన్స్ మెంట్ ప్రోగ్రామే ఆ స్థాయిలో వైరల్ అయ్యింది మరి. ఇటీవల చంద్రహాస్ ని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నానంటూ ప్రభాకర్.. ప్రెస్ మీట్ పెట్టి, ఒకేసారి మూడు సినిమాలు అనౌన్స్ చేసి షాకిచ్చాడు. అదేంటీ.. ఒకటి కూడా రిలీజ్ అవ్వకముందే మూడు అనౌన్స్ చేస్తున్నారని అంతా నోరెళ్లబెట్టారు.
ఈ ఒక్క ప్రెస్ మీట్ తో సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు చంద్రహాస్. ఎందుకంటే.. ప్రెస్ మీట్ లో చంద్రహాస్ ఎక్సప్రెషన్స్, యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉందని అందరూ ట్రోల్ చేశారు. కానీ.. చంద్రహాస్ పై వస్తున్న ట్రోల్స్ పై తర్వాత ప్రభాకర్ స్పందించారు. చంద్రహాస్ కి ప్రస్తుతం ఇండస్ట్రీ కొత్త.. ముందు ముందు తనే నేర్చుకుంటాడు.. తన యాటిట్యూడ్ నచ్చలేదు కాబట్టి ట్రోల్ చేస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక యాక్టింగ్ నచ్చితే.. ట్రోల్ చేసినవారే అభినందిస్తారు’ అని చెప్పుకొచ్చారు. సరే సినిమా వచ్చాక చూసుకుందాంలే అని ట్రోలర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. కట్ చేస్తే.. మళ్లీ చంద్రహాస్ పై ట్రోల్స్ మొదలైపోయాయి.
అందుకు కారణం అదే యాటిట్యూడ్ అని అంటున్నారు. మరి కొత్తగా ఏం చేశాడు? అని ఆరా తీయగా.. ప్రస్తుతం తండ్రి ప్రభాకర్ తో పాటు చంద్రహాస్ అయ్యప్పస్వామి మాల ధరించాడు. సరే.. దేవుడి మాల ధరించినవారు ఆ మాలలో ఉన్నన్ని రోజులు ఎంతో దైవభక్తితో, డిగ్నిటీగా బిహేవ్ చేస్తుంటారు. కానీ.. చంద్రహాస్ మాలలో ఉండి కూడా తన యాటిట్యూడ్ ని వదల్లేదట. కొత్తగా ప్రభాకర్ ఫ్యామిలీ థార్ కారు కొన్నారు. ఆ కారుతో పాటు ఫ్యామిలీ పిక్ దిగారు బాగానే ఉంది. కానీ.. మాలలో ఉన్నప్పుడు దైవభక్తిని మర్చిపోయి.. డిఫరెంట్ ఫోజులతో.. షర్ట్ లేకుండా నడిరోడ్డుపై హెయిర్ స్టయిల్ యాటిట్యూడ్ తో ఫోటోలు దిగి పోస్ట్ చేశాడు చంద్రహాస్.
మరి మాలలో ఉన్న సెలబ్రిటీ అలా బిహేవ్ చేస్తే ఊరుకుంటారా.. వెంటనే ట్రోలర్స్ మొదలుపెట్టేశారు. చంద్రహాస్ మాలలో ఉండి.. కారు చుట్టూ పోజులు పెట్టి దిగిన పిక్స్ షేర్ చేస్తూ.. చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ కి న్యాయం చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్స్ మాలలో ఉండి పిచ్చి చేష్టలు ఏంటంటూ విమర్శిస్తున్నారు. అయితే.. చంద్రహాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త కారుతో ఫోటోలు దిగాలని సరదా ఉండటం తప్పుకాదు. కానీ.. ఆ స్వామి మాలను తీసేవరకు వెయిట్ చేస్తే బాగుంటుందని పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చంద్రహాస్ కారుతో దిగిన పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.