తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సామాన్యంగా దర్శకులకు అభిమానులు ఉండటం చాలా అరుదు. కానీ త్రివిక్రమ్ విషయంలో ఇది రివర్స్ ఉంటుంది. కేవలం ఆయన కలం నుంచి వచ్చిన డైలాగ్ ల కోసం సినిమా చూడ్డానికి వెళ్తారనడం అతిశయోక్తి కాదు. దర్శకుల్లో ఎవరికి లేనటువంటి ఫ్యాన్ పాలోయింగ్ త్రివిక్రమ్ సొంతం. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం అని అందరికి తెలుసు. ప్రసుత్తం త్రివిక్రమ్ హైదరాబాద్ లో ఉంటున్నపటికి.. ఆయన తల్లిదండ్రులు మాత్రం స్వస్థలంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సుమన్ టీవీ.. పశ్చిమగోదావరి జిల్లాలో త్రివిక్రమ్ తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటి హోమ్ టూర్ చేసింది. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..