Trivikram Srinivas: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దంపతులు పశ్చిమగోదావరిలోని కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం గురుపౌర్ణిమను పురస్కరించుకుని త్రివిక్రమ్ తన సతీమణి సౌజన్యతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. దంపతులకు కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇద్దరినీ ఘనంగా సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు.
ఇక, ఆలయ సందర్శన సందర్భంగా త్రివిక్రమ్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడుతూ. గురుపౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎంతో మహిమగల కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరస్వామిని ఏటా దర్శించుకునేందుకు వస్తుంటానన్నారు.
కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ మూడో సారి రిపీట్ అవుతుండడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి, త్రివిక్రమ్- మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ram Gopal Varma: నేను గే ని కాదు.. కానీ ఆ హీరోని ముద్దు పెట్టుకోవాలని ఉంది: RGV