త్రివిక్రమ్ మాటలతోనే కాదు.. ఆయన సినిమాలలో హీరోయిన్స్ పై, వారి క్యారెక్టరైజేషన్స్ తో కూడా ప్రేమలో పడిపోతుంటారు అభిమానులు. కానీ.. ఫ్యాన్స్ కంటే ముందే త్రివిక్రమ్.. తన హీరోయిన్స్ తో లవ్ లో పడిపోతున్నాడేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే..
టాలీవుడ్ అగ్రదర్శకుడు త్రివిక్రమ్ మాటల మ్యాజిక్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో స్టేజ్ పై పెద్దగా మాట్లాడేవారు కాదు.. కానీ, ఈ మధ్యకాలంలో స్టేజ్ ఎక్కితే చాలు.. నాన్ స్టాప్ మాట్లాడుతూ ఆయన మాటలతో ప్రేమలో పడేలా చేస్తున్నారు. అలా త్రివిక్రమ్ మాటలతోనే కాదు.. ఆయన సినిమాలలో హీరోయిన్స్ పై, వారి క్యారెక్టరైజేషన్స్ తో కూడా ప్రేమలో పడిపోతుంటారు అభిమానులు. కానీ.. ఫ్యాన్స్ కంటే ముందే త్రివిక్రమ్.. తన హీరోయిన్స్ తో లవ్ లో పడిపోతున్నాడేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే.. రీసెంట్ గా త్రివిక్రమ్ కి, భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ ల మధ్య జరిగిన సంఘటనలే కారణం.
అవును.. త్రివిక్రమ్ తన సినిమాలలో హీరోయిన్స్ క్యారెక్టర్స్ ని ఎంతలా ప్రేమించి రాస్తారో.. అప్పుడప్పుడు హీరోయిన్స్ పై ప్రేమను కూడా నిర్మొహమాటంగా బయట పెడుతుంటారు. అలా హీరోయిన్ సంయుక్త మీనన్ కి త్రివిక్రమ్.. ఓసారి కాల్ అని సైగ చేయడం.. తాజాగా సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమెకు ‘ఐ లవ్ యూ’ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. జనాలు ఎలా అర్థం చేసుకున్నా.. దర్శకులు తమ హీరోయిన్స్ ని కొనియాడటం.. వాళ్ళ గురించి ప్రేమగా మాట్లాడటం మామూలే. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ దశలో సంయుక్త బర్త్ డేని సెట్ లోనే జరిపారు. ఆ టైంలో కేక్ కట్ చేశాక.. సంయుక్తకి కాల్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు త్రివిక్రమ్.
ఇక తాజాగా సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పైనే సంయుక్తకి ఐ లవ్ యూ అని చెప్పాడు. ఇప్పుడీ రెండు వీడియోలను కలిపి.. త్రివిక్రమ్ సంయుక్త మీనన్ తో అప్పుడలా, ఇప్పుడిలా అంటూ వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ప్రెజెంట్ త్రివిక్రమ్, సంయుక్తల వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. త్రివిక్రమ్ మాటల వెనుక తప్పుగా అర్థం చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. దర్శకుడిగా, భీమ్లానాయక్ రైటర్ గా, సార్ మూవీ ప్రొడ్యూసర్ గా.. సంయుక్త నటనని దగ్గరగా చూశారు త్రివిక్రమ్. సో.. ఆమె నటన నచ్చే.. ఆమెపై ప్రేమను అలా వ్యక్తం చేశాడని అంటున్నారు. ఇక సార్ మూవీ ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషలలో వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించగా.. వెంకీ అట్లూరి సినిమాని తెరకెక్కించారు. మరి త్రివిక్రమ్, సంయుక్త మీనన్ ల వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.