హీరోయిన్స్ ని డైరెక్టర్ అభిమానిస్తూ ఉంటారు. అప్పుడే సినిమాలో క్యారెక్టర్స్ అద్భుతంగా వస్తాయేమో! తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్.. ఓ హీరోయిన్ పై తన ప్రేమని వ్యక్తపరిచారు.
త్రివిక్రమ్ అనగానే అద్భుతమైన డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలే గుర్తొస్తాయి. ఇండస్ట్రీలో రైటర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత కాలంలో సూపర్ హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమాలు హిట్ ఫ్లాప్ సంగతి పక్కనబెడితే.. ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తాయి. మళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి. ఆయన సినిమాల్ని గమనిస్తే మీకో విషయం కచ్చితంగా అర్థమవుతుంది. హీరోయిన్స్ ని ఎంతలా ప్రేమిస్తాడనేది తెలుస్తుంది. ఇప్పుడు కూడా అలానే ఓ యువ హీరోయిన్ పై ప్రేమని వ్యక్తపరిచారు. అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. త్రివిక్రమ్ ఇప్పటివరకు 11 సినిమాలకు దర్శకత్వం వహించారు. తన 12వ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ ఏ హీరోయిన్ తో అయినా వరసగా రెండు- మూడు సినిమాలు చేయడం చాలా కామన్ అయిపోయింది. ‘జల్సా’, ‘జులాయి’లో ఇలియానా నటించగా… ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అఆ’లో సమంత నటించింది. ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’తో పాటు ఇప్పుడు తీస్తున్న మహేష్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఈ భామలందరినీ త్రివిక్రమ్ అభిమానించబట్టే వాళ్ల క్యారెక్టర్స్ అంత బాగా మనల్ని ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం డైరెక్టర్ గా ఉంటూనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యహరిస్తున్నారు. అలా ‘సార్’ తీశారు. ఇది ఫిబ్రవరి 17న థియేటర్లలోకి రానుంది. ఇందులో హీరోయిన్ గా చేసిన సంయుక్త మేనన్ కు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ఐ లవ్ యూ చెప్పారు. బహుశా ఆమె యాక్టింగ్ కు ఫిదా అయి ఈ మాట చెప్పారేమో అనిపిస్తుంది. కుదిరితే తన తర్వాత సినిమాల్లో ఆమెని హీరోయిన్ గా పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సరే ఇదంతా పక్కనబెడితే.. గురూజీ, హీరోయిన్ సంయుక్తకు ఐ లవ్ యూ చెప్పడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
When trivikram said “All the best #Samyuktha and I Love You.” Whole ground erupted.
Please please just listen I’ve to tell something more.
– #Trivikram at #SIR Pre Release Eventpic.twitter.com/fD5RFDtoQS
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) February 15, 2023