హీరోయిన్ త్రిషకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది కూడా 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ వల్ల. ఇంతకీ ఆమెకి వచ్చిన సమస్యేంటి తెలియాలా ఈ స్టోరీ చదివేయండి.
తెలుగు డైరెక్టర్ రాజమౌళి తీసిన ‘బాహుబలి’.. వరల్డ్ వైడ్ వండర్స్ క్రియేట్ చేసింది. దీంతో మిగతా దర్శకులు ఇలాంటి
సినిమాలు తీసే ప్రయత్నాలు చాలానే చేశారు. కానీ ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం.. ఇలాంటి పీరియాడికల్ మూవీనే తీశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ తీసిన ‘పొన్నియన్ సెల్వన్’ తొలి పార్ట్.. గతేడాది థియేటర్లలోకి వచ్చింది. తమిళ ప్రేక్షకుల్ని మినహా వేరే ఎవర్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏప్రిల్ 28న సీక్వెల్ రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా వల్ల హీరోయిన్ త్రిషకు కష్టాలు వచ్చాయి! ప్రస్తుతం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక విషయానికొస్తే.. ఈ మూవీని ఫేమస్ రైటర్ కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ బుక్ ఆధారంగా తీశారు. ఇందులో ఐశ్వర్యరాయ్, కార్తి, విక్రమ్, త్రిష లాంటి స్టార్స్ నటించారు. అందరికీ మంచి మంచి క్యారెక్టర్స్ దక్కాయి. అయితే ఆ పేర్లు, ఆయా సీన్లలో ఎక్కువగా తమిళ నేటివిటీ ఉండటం.. మిగతా భాషల ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయింది. అయితే ఇందులో రాణి కుందవిగా నటించిన త్రిష మాత్రం ఫుల్ మార్క్స్ కొట్టేసిందనే చెప్పాలి. 40 ఏళ్లకు దగ్గరవుతున్నా సరే గ్లామర్ తో కట్టిపడేసింది. ఈ సినిమా ఆమెకు విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్సులు తీసుకొచ్చింది. కానీ ఓ విషయంలో మాత్రం చిక్కుల్లో పడేసింది.
‘పొన్నియన్ సెల్వన్’ కుందవిగా నటించిన త్రిష.. ట్విటర్ లోనూ తన పేరుకు బదులు కుందవి అని మార్చుకుంది. ఇలా పేరు మార్చుతూ ఉండేసరికి.. సెలబ్రిటీలకు వచ్చే బ్లూ టిక్ ఈమె కోల్పోయింది. కుందవి పేరు తీసేని తన పేరు పెట్టుకున్నప్పటికీ.. బ్లూ టిక్ అయితే తిరిగి రాలేదు. ఇదే సినిమాలో నటించిన జయం రవికి కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ అతడు ట్విట్టర్ పేరులో పెద్దగా మార్పు అయితే చేయలేదు. ఇదిలా ఉండగా.. తొలి పార్ట్ లో తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో సెకండ్ పార్ట్ పై రిలీజ్ అవుతున్నా ఏ మాత్రం బజ్ లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో? మరి ‘PS-2’ మూవీ వల్ల ట్విట్టర్ లో త్రిషకు ప్రాబ్లమ్ రావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
We couldn’t have asked for better🫰🏻
Thank you for the euphoria🙏🏻🧿#Coimbatore #ps2 #cholatour pic.twitter.com/Y9Y9hNtZgh— Trish (@trishtrashers) April 17, 2023