బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బెస్ట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. బాలయ్య మాస్ జాతరలో ప్రేక్షకులు సంబరాలు చేసుకుంటున్నారు. హౌస్ ఫుల్ కలెక్షన్లతో ‘అఖండ’ విజయాన్ని అందించారు ప్రేక్షకులు. ముఖ్యంగా బాలయ్య.. హిందూ ధర్మం గురించి.. టెంపుల్స్ పరిరక్షణ గురించి హెచ్చరిస్తూ చెప్పిన డైలాగ్‌లకు పలు హిందూ సంఘాలు హర్షం చేస్తూ ఆ పవర్ ఫుల్ డైలాగ్‌ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
టాలీవుడ్ లో అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు ఎస్ ఎస్ థమన్. ప్రస్తుతం తమన్ హవా మాములుగా లేదు. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందించిన సినిమాలు దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు తమన్. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా బాలయ్య నటించిన అఖండ మూవీ గురించే టాక్ నడుస్తుంది. అయితే తమన్ అఖండ కు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు.
ఈ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. నిజంగానే ఆ సౌండ్ కి థియేటర్ దద్దరిల్లిపోయేలా ఉంది. దీనితో.. USA లో ‘సినిమార్క్ యాజమాన్యం.. థియేటర్ నిబంధనలను అనుసరించి సౌండ్ ను పరిమిత డెసిబుల్స్ వరకు మాత్రమే చూపిస్తామని, ప్రేక్షకులు సహకరించాలని కోరారు’. అఖండ సక్సెస్ కి థమన్ మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అయ్యిందని.. తమన్ అన్న ఇరగదీసాడుగా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ చేస్తున్నారు.