పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కుడిచేతి ఉంగరం వేలుకు తాబేలు ఉంగరాన్ని ధరించారు. ఆయన తన కుడి చేతికి తాబేలు ఉంగరాన్ని ధరించటం వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఆ తాబేలు ఉంగరానికి..
2024 సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నారు. ఈ ఎన్నికలు పార్టీకి, ఆయనకు కీలకం కావటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముందుకు వెళుతున్నారు. ఓ వైపు సినిమా షూటింగ్‌లు చేస్తూనే మరో వైపు ప్రజా పర్యటనలు చేస్తున్నారు. 2019 ఎన్నికల టైం కంటే ఇప్పుడు పరిస్థితి మారింది. జనసేనకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రజలు కూడా పవన్ వైపు మొగ్గు చూపుతున్నారు.
అతి త్వరలో ఆయన ‘వారిహి’ యాత్రతో ప్రజల్లోకి పూర్తిగా వెళ్లనున్నారు. ఎన్నికల వరకు జనంలోనే పర్యటించనున్నారు. ఈ సారి కచ్చితంగా విజయం సాధించాలన్న పట్టుదలతో పవన్ ఉన్నారు. అందుకే జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే తాబేలు ఉంగారాన్ని ధరించారు. ఆయన తన కుడి చేతి ఉంగరం వేలుకు బంగారంతో తయారు చేసిన తాబేలు ఉంగరాన్ని పెట్టుకున్నారు. ఆయన ఈ ఉంగరాన్ని ధరించటం వెనుక పెద్ద కథే ఉంది.
జ్యోతిష్య శాస్త్రంలో తాబేలు ఉంగరం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. హింధూ ధర్మం ప్రకారం తాబేలు మహా విష్ణువు అవతారాల్లో ఒకటి. క్షీర సాగర మథనం సమయంలో విష్ణువు ఈ అవతారాన్ని ధరించాడు. అందుకే ఈ ఉంగరం ధరించటం వల్ల పాజిటివ్ శక్తి వస్తుందట. ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారు ఈ ఉంగారాన్ని ధరించటానికి లేదు. కొన్ని రాశుల వారే ధరించాలి. తాబేలు కుబేరుడి వాహనం కాబట్టి..
ఆర్థికంగా ఇబ్బంది పడేవారు ఈ ఉంగారాన్ని పెట్టుకోవటం వల్ల మంచి లాభాలను పొందొచ్చట. పవన్ తాను ఆర్థికంగా సరిగా లేనని చాలా సార్లు చెప్పారు. ఆర్థికంగా, తాను ఎంచుకున్న రాజకీయ రంగంలో విజయం సాధించటానికే జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహా మేరకు ఈ తాబేలు ఉంగరాన్ని ధరించినట్లు తెలుస్తోంది. మరి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన కుడి చేతికి తాబేలు ఉంగరం ధరించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.