ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలంటే ఇదివరకు హిట్స్, ప్లాప్స్ బట్టి నిర్ణయించేవారని విన్నాం. కానీ ఈ మధ్య ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టి ఇండస్ట్రీ కింగ్ అంటూ సంబోధిస్తున్నారు. ఏ హీరో సినిమా రిలీజైన మొదటిరోజు ఓపెనింగ్ కలెక్షన్స్ ఎంత ఎక్కువ రాబడితే.. అంత పెద్ద హిట్ అని, ఫస్ట్ డే రాబట్టిన కలెక్షన్స్ తోనే ఇండస్ట్రీ కింగ్ అని డిసైడ్ చేసేస్తున్నారు. ఈ కొలతలు, కొలమానాలన్నీ అభిమానుల వరకే అయినా ఇండస్ట్రీ మొత్తాన్ని కలపకుండా ఉండలేరుగా ఫ్యాన్స్.
సినీ వర్గాలు కూడా స్టార్లను వారి హిట్లను లెక్కలోకి తీసుకోకుండా సినిమా కలెక్షన్స్ బట్టి విడదీస్తుండటం గమనార్హం. ఈ మధ్యకాలంలో ఈ కలెక్షన్స్ గోల ఎక్కువైపోయింది. కొన్ని సినిమాలు మొదట్లో అద్భుతమైన కలెక్షన్స్ రాబడతాయి. కొన్ని సినిమాల కలెక్షన్స్ మెల్లగా పుంజుకుంటాయి. కానీ ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్(గ్రాస్) ఎంత అనేది పక్కా లెక్కలోకి వస్తుందంటున్నారు. మరి హైయెస్ట్ డే 1 ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు హీరోలలో ఇండస్ట్రీ కింగ్ ఎవరో చూద్దాం!
1. RRR (2022): యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే రూ. 223 కోట్లు రాబట్టింది. ఈ ఇద్దరు హీరోల కెరీర్ ది బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవే.
2. బాహుబలి-2 (2017): రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఫస్ట్ డే రూ. 217 కోట్లు వసూల్ చేసింది. ప్రభాస్ కెరీర్ లో ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఫస్ట్ మూవీ ఇదే.
3. సాహో (2019): ప్రభాస్ నటించిన ఈ ఫుల్ లెన్త్ యాక్షన్ మూవీ.. ఫస్ట్ డే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఫస్ట్ డే రూ.130 కోట్లు ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. ప్రభాస్ కెరీర్లో ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రెండో సినిమా ఇది.
4. సైరా నరసింహా రెడ్డి (2019): మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఇక ఫస్ట్ డే రూ.82 కోట్లు రాబట్టి టాప్ లిస్ట్ లో నిలిచింది. మెగాస్టార్ కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్ వసూళ్లు ఇవే.
5. రాధే శ్యామ్ (2022): డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ లవ్ డ్రామా పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ డే రూ. 79 కోట్లు రాబట్టింది.
6. బాహుబలి ది బిగినింగ్ (2015): ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన ఈ సినిమా ఫస్ట్ డే రూ.75 కోట్లు వసూల్ చేసింది.
7. పుష్ప (2021): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే రూ. 74 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టింది.
8. సరిలేరు నీకెవ్వరూ (2020): సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా ఫస్ట్ డే రూ.68 కోట్లు వసూల్ చేసింది.
9. అజ్ఞాతవాసి (2018): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఫస్ట్ డే రూ. 60.50 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది.
10. భరత్ అనే నేను (2018): మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఈ సినిమా ఫస్ట్ డే రూ.60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.
11. అరవింద సమేత వీరరాఘవ (2018): జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఫస్ట్ డే రూ.60 కోట్లు ఓపెనింగ్ గ్రాస్ వసూల్ చేసింది.