కన్నడ సూపర్ స్టార్ యష్– సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో KGF. సినిమా రంగంలో కేజీఎఫ్ సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. మొత్తం దేశాన్ని ఉర్రూతలూగించిన చిత్రం ఇది. ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల లిస్ట్ లో మొదట ఉండేది KGF-2 సినిమా. ఆ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కారణంగా ఇప్పటికే రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదలకానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్రారంభించేశారు.
ఇదీ చదవండి: ఒకేసారి రెండు OTTల్లో ‘భీమ్లానాయక్’.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..
తాజాగా కేజీఎఫ్-2కు సంబంధించిన ఓ లిరికల్ సాంగ్ ఒకటి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మార్చి 21న ఉదయం 11 గంటల 07 నిమిషాలకు లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ పోస్టర్ చూస్తే.. సలాం రాకీ భాయ్ సాంగ్ సీన్ ను తలపిస్తోంది. మొదటి పార్ట్ లో డాన్ ని చంపిన తర్వాత రాకీని ఎలివేట్ చేస్తూ తీసిన సాంగ్ అయిఉండవచ్చు. ఈ సాంగ్ కు తుఫాన్ అనే పేరు పెట్టారు. మార్చి 21న యూట్యూబ్ కు తుపాను హెచ్చరికలు జారీ చేయాలంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.