ఇండస్ట్రీలో వరస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది చాలామంది ప్రముఖులు మరణించారు. 2023 వచ్చి నెల రోజులు కూడా కాలేదు. కళాతపస్వి కాలం చేశారు. ఇప్పుడు మరో ప్రముఖ రచయిత మరణించారు.
గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కైకాల సత్యనారాయణ, కృష్ణంరాజు, కృష్ణ.. ఇలా చాలామంది ప్రముఖులు గతేడాది కాలం చేశారు. ఇంకా ఫ్యాన్స్ ఆ బాధలో ఉండగానే.. రీసెంట్ గా కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త, అభిమానుల్ని మరింతగా శోకసంద్రంలో ముంచేసింది. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ప్రముఖ రచయిత తుదిశ్వాస విడిచారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులో పుట్టిన యడవల్లి వెంకట లక్ష్మీ నరసింహాశాస్తి.. తండ్రి ఉద్యోగం కారణంగా విజయవాడలో స్థిరపడ్డారు. ఎంఏ వరకు చదువుకున్న ఈయనకు సాహిత్యంపై మంచి పట్టు ఉండేది. దీంతో కుర్రాడిగా ఉన్న టైంలోనే ‘నక్షత్రాలు’ అనే పుస్తకం రాశారు. ఇక రాధాకృష్ణమూర్తి అనే నిర్మాత ద్వారా యడ్లవల్లి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, కన్నడలో పలు సినిమాలకు రచయితగా పనిచేశారు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కూడా ఈయన కలిసి పనిచేశారు. ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా, లాంగ్వేజ్ ఎక్స్ పర్ట్ గా చిత్రసీమకు సేవలు అందిస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా గత 50 రోజుల నుంచి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా శనివారం మృతి చెందారు.