చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన మహేశ్ బాబు ‘సూపర్ స్టార్’గా ఎదగడానికి ఎంతో సమయం పట్టలేదు. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు.. తర్వాత యువరాజు, వంశీ పెద్దగా ఆకట్టుకోలేదు. కృష్ణవంశీ తీసిన మురారి మహేశ్ కెరీర్‌లో పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఒక్కడు, అతడు, పోకిరి, ఖలేజా, దూకుడు, బిజినెస్‌మేన్ ఇలా తన కెరీర్‌లో ఎన్నో హిట్లు. బాక్సీఫీసు రికార్డులను తిరిగరాసిన ఎన్నో సినిమాలు చేశాడు మహేశ్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక్కో సినిమాకి దాదాపు 40 నుంచి 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు మహేశ్. ఈ విధంగా మహేశ్ బాబు ఆస్తులు ఎంతుంటాయి అనే ప్రశ్న మీకు రాకపోదు. ప్రముఖ మ్యాగజైన్ ‘స్పాట్‌లైట్’ లెక్కల ప్రకారం ప్రస్తుతం మహేశ్ బాబు ఆస్తుల విలువ దాదాపు రూ.8,400 కోట్లు.
మహేశ్ బాబు సినిమాలే కాదు.. పలు యాడ్స్‌లో నటిస్తుంటాడు. చాలా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు మహేశ్ బాబు. అలా యాడ్స్ ద్వారా మహేశ్‌కు ఏడాదికి దాదాపు 180 కోట్ల రూపాయల దాకా వస్తుందని తెలుస్తోంది. ఏదేమైనా ఏడాదికి యాడ్స్, సినిమాల నుంచే మహేశ్‌కు ఎలా లేదన్న దాదాపు 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని లెక్కలేస్తున్నారు. సంపాదన విషయంలో మహేశ్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాడని అందరికీ తెలుసు. తనకు ఏటా వచ్చే ఆదాయాన్ని మహేశ్ వ్యాపారాల వైపు మళ్లించాడు. ఎన్నో రకాల వ్యాపారాల్లో మహేశ్‌కు పెట్టుబడులు ఉన్నట్లు స్పాట్‌లైట్ మ్యాగజైన్ ప్రస్తావించింది.
నమ్రతా, మహేశ్ బాబు టాలీవుడ్‌లో ఎంతో క్యూట్ కపుల్. నమ్రతా.. మహేశ్‌ను వివాహం చేసుకుని ఘట్టమనేని కోడలిగా వచ్చే సమయంలో పెద్ద మొత్తంలోనే ఆస్తులను తీసుకొచ్చిందని సమాచారం. కెరీర్ పరంగానూ నమ్రతాను వివాహం చేసుకన్న తర్వాత మహేశ్ బాబు స్టార్ తిరిగిందని సీనీ పండితులు అభిప్రాయపడుతుంటారు.
మహేశ్ బాబు ఎన్నో కమర్షియల్ సినిమాలు తీసిన ఆయన ఆలోచన అంతా సమాజహితంగానే ఉంటుంది. మహేశ్‌బాబు కృషితో కొన్ని వేల మంది చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు వచ్చాయి. కొన్ని వేల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాడు మహేశ్ బాబు. చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలే కాదు.. గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారానూ మహేశ్ సేవలను కొనసాగిస్తున్నాడు. తన ఎదుగుదల మాత్రమే కాదు.. చుట్టూ ఉండే వారి బాబోగుల గురించి కూడా మహేశ్ ఎప్పుడూ ఆలోచిస్తుంటాడని సినీ వర్గాల్లో టాక్.
టాలీవుడ్ అగ్రతారల్లో ఆస్తుల పరంగా మహేశ్ బాబు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరని టాక్ వినిపిస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి.. స్పాట్ లెక్కల ప్రకారం మహేశ్ బాబు ఆస్తులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.