విశ్వక్ సేన్ Vs యాంకర్ దేవీ నాగవల్లి వివాదం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో విశ్వక్ కు మద్దతు లభిస్తుంటే.. మహిళా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు దేవీ నాగవల్లికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి విశ్వక్ కు మొదట సపోర్ట్ లభించలేదు. కానీ, తర్వాత విశ్వక్ కోసం మాట్లాడటం చూశాం. అతని సినిమా చూడాలంటూ కో యాక్టర్స్ కూడా ట్వీట్లు చేశారు. అంటే నేరుగా కాకపోయినా కూడా విశ్వక్ తమ సపోర్ట్ ప్రకటించారు. అయితే ఇండస్ట్రీ మనిషిగా నిర్మాత నట్టి కుమార్ మాత్రం యాంకర్ దేవీ నాగవల్లికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ మొత్తం వివాదంపై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.
ఇదీ చదవండి: వివాదం తరువాత ఆ వీడియో షేర్ చేసి.. ఎమోషనలైన దేవి నాగవల్లి!
‘విశ్వక్ సేన్ అనుకున్నది సాధించాడు. ప్రాంక్ చేసి తన సినిమాకి పబ్లిసిటీ తెచ్చుకోవాలి అనుకున్నాడు. టీవీ ఛానల్, మీడియా వాళ్లు ఆ వివాదాన్ని వైరల్ చేసి, వీడియోలు చేసి సినిమా కావాల్సిన పబ్లిసిటీ కల్పించారు. విశ్వక్ ఏదైతే కోరుకున్నాడో అది జరిగిపోయింది. కానీ, యాంకర్ దేవీ నాగవల్లికి మాత్రం న్యాయం జరగలేదు. విశ్వక్ చేసింది తప్పు అని మీరు భావించనప్పుడు అతని వీడియోలు ఆపేయాలి. అతని సినిమా ప్రమోషన్స్ చూపించకూడదు. కానీ, అదే ఛానల్ లో సినిమా ప్రమోషన్స్ వస్తున్నాయి. విశ్వక్ ఒక ఆడపిల్లని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అతనికి ఎంత కోపం వచ్చినా అలాంటి పదాలు మాట్లాడకూడదు.’ అంటూ నట్టి కుమార్ కామెంట్ చేశారు. తన మద్దతు నాగవల్లికే అని చెప్పకే చెప్పారు. నట్టి కుమార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.