వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన వేడుక. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా ఎంతో వైభవంగా చేసుకోవాలని ఆశిస్తారు. ప్రస్తుత కాలంలో సామాన్యుల ఇంట పెళ్లి వేడుకలే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక సెలబ్రిటీల గురించి చెప్పాల్సిన పని లేదు. భారీగా ఖర్చుతో.. అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కానీ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత హేమంత్ కుమార్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. అనవసరపు ఆర్భాటాలకు పోకుండా చాలా సాధారణంగా గుడిలో వివాహం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మార్చి 30న వీరి వివాహం జరిగింది.
Thank you so much for all your wishes and messages. @sujani_sanjeevi and I are really touched by your kind words and love ❤️😇🤗 https://t.co/uGiJfI5uQy
— Hemanth Kumar C R (@crhemanth) March 31, 2022
ఇది కూడా చదవండి: శ్రుతిహాసన్ తో తన పెళ్లి జరిగిపోయిందంటూ శంతను కామెంట్స్..
‘కోయంబత్తూరులోని ఓ దేవాలయంలో సుజని, నేను పెళ్లి చేసుకున్నాం. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సమక్షంలోనే మా వివాహం జరిగింది. నీ జీవిత భాగస్వామిగా నన్ను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు సుజని’ అని రాసుకొచ్చాడు. హేమంత్ భార్య సుజనీ కూడా’నువ్వు నావాడివైనందుకు సంతోషంగా ఉంది, నువ్వు నా ప్రపంచానివి, లవ్ యూ’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరి వివాహ విషయం తెలియడంతో.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హేమంత్ కుమార్ ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థకు సహ వ్యవస్థాపకుడు. ఇంత సింపుల్ గా వివాహం చేసుకున్న నిర్మాత ఆలోచన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It’s Mr. and Mrs. from now. Thank you @crhemanth for choosing to be mine, to hold and cherish forever. You mean the world to me. Love you so much❤️ pic.twitter.com/wCZ9VERzq4
— Sujani Sanjeevi (@sujani_sanjeevi) April 1, 2022
ఇది కూడా చదవండి: ప్రభాస్ పెళ్లి విషయంలో రాజమౌళి సెటైర్లు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.