తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో గల్లీకుర్రాడిగా తెలుగుతెరకు పరిచయమైన ప్రభాస్. ఇక ‘బాహుబలి’చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలందుకొని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పటి వరకు రూ.100 కోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తాని సగర్వంగా చాటిన యువ తరంగం ప్రభాస్. లవర్‌బాయ్‌గా, అమ్మాయిల కలల రాకుమారుడిగా, మాస్ హీరోగా, అమరేంద్ర బాహుబలిగా ఇలా పలు పాత్రలతో వైవిధ్యాన్ని కనబరిచాడు.
టాలీవుడ్ డార్లింగ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇప్పటివరకు 19 సినిమాల్లో నటించి స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు వర్షం, చత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి సీరీస్. ఇండస్ట్రీలో ఎలాంటి హీరో అయినా తన కెరీర్ లో కొన్ని అద్భుతమైన సినిమాలను మిస్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ప్రభాస్ కెరీర్ లో కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు.
దిల్ : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదట దర్శకులు వివివినాయక్ ప్రభాస్‌కి బాగా సూట్ అవుతుందని కథ వినిపించాడట. కానీ అప్పుడప్పుడే కెరీర్ మొదలు పెట్టిన ప్రభాస్ వేరే చిత్రానికి కమిట్ కావడంతో ‘దిల్’ మూవీని వదిలేశారట.
సింహాద్రి: యంగ్ టైగర్ యన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ ‘సింహాద్రి’. మొదట దర్శకులు రాజమౌళి మొదట బాలకృష్ణ తో చేయాలని అనుకున్నారట… కానీ ఆయన రిజక్ట్ చేశారట. ఆ తర్వాత ప్రభాస్ వద్దకు వెళ్లారట.. అయితే అప్పటికే ‘స్టూడెంట్ నెం.1’క్లాస్ సినిమా తీసిన రాజమౌళి మాస్ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేయలేడేమోననే అన్న డౌట్ తో రిజక్ట్ చేశారట.
ఒక్కడు : సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘ఒక్కడు’. ఈ మూవీ డైరెక్టర్ గుణశేఖర్ మొదట కృష్ణంరాజు, ప్రభాస్ కి కథ వినిపించారట. కబడ్డీ గేమ్, స్క్రిప్ట్ రిస్క్‌గా ఉందని రిజెక్ట్ చేశారట.
బృందావనం : స్టార్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మున్నా’ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇది దృష్టిలో పెట్టుకొని ‘బృందావనం’ స్టోరీని ప్రభాస్ దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారట. ఈ చిత్రం ప్రభాస్ తో తీయాలని దిల్ రాజ్ కి కూడా మంచి ఉత్సాహం ఉన్నప్పటికీ.. అప్పటికే రెండు సినిమాలకి ప్రభాస్ కమిట్ అవ్వడంతో చేయలేకపోయాడట.
ఆర్య : సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్య’. ఈ చిత్రం మొదట నితిన్, రవితేజ వద్దకు వెళ్లిందట.. వారు కాదంటే ప్రభాస్ కి కథ వినిపించాడట సుకుమార్. అయితే కాలేజ్ వాతావరణం.. మరికొన్ని కారణాల వల్ల ప్రభాస్ కూడా రిజక్ట్ చేశారట. మొత్తానికి ఈ మూవీ అల్లు అర్జున్ కి దక్కడం సూపర్ హిట్ కొట్టడం జరిగింది.
డాన్ శీను : గోపీచంద్ మలినేని తో మంచి పరిచయం ఉన్న ప్రభాస్ ‘డాన్ శీను’ కథ అంతా ఒకే అయ్యాక అనుకోకుండా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ చిత్రంలో రవితేజ నటించి మంచి హిట్ అందుకున్నాడు.
కిక్ : సుందర్ రెడ్డి ఈ కథ మొదట యన్టీఆర్ కి వినిపించారట.. అప్పటికే మరో మూవీ కమిట్ అయి ఉండటం వల్ల యన్టీఆర్ రిజక్ట్ చేశారట. ఆ తర్వాత ఈ కథ ప్రభాస్ కి వినిపించినా.. తనకి సూట్ అవ్వదని ప్రభాస్ రిజెక్ట్ చేశారట. ఈ చిత్రంలో రవితేజ నటించడం మంచి హిట్ అందుకోవడం జరిగింది.