టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు రవితేజ విచారణ ముగిసింది. సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. విచారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా రవితేజ హమీనిచ్చారు. ఇప్పటికే పూరి,చార్మి,రకూల్ ప్రీత్ సింగ్,నందూ,రానా, ముమైత్ ఖాన్ లను ఈడి ప్రశ్నించింది. కాగా ఈ కేసులో ముఖ్య ముద్దాయి అయిన కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ టాలీవుడ్ సెలబ్రెటీల మీద కొరడా ఝులిపిస్తున్న సమాచారం.
గురువారం ఉదయం ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం సినీ నటుడు రవితేజ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో రవితేజ కార్యాలయం బయటకు వచ్చి… మీడియాతో ఏమీ మాట్లాకుండా కారులో వెళ్లిపోయారు. రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బ్యాంకు వివరాలు, డ్రైవర్ శ్రీనివాస్ తో జరిపిన ఆర్థిక లావాదేవీలపై రవితేజను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే. ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జిషాన్ 2017లో కొకైన్ సరఫరా చేస్తూ ఎక్సైజ్ శాఖకు దొరికాడు.
జిషాన్‌తో పాటు బెర్నాడ్ అలియాస్ విలియమ్స్‌ను ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసింది. సినీ ఇండస్ట్రీతో సంబంధాలు పెట్టుకొని వారికి మత్తు రుచి చూపించి పలు మోసాలకు తెగబడినట్టుగా.. సోషల్ మీడియా, యాప్‌ల ద్వారా సినీ తారలకు జిషాన్, విలియమ్స్ డ్రగ్స్ సరఫరా చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. కెంట్ అనే వ్యక్తి ద్వారా నైజీరియా నుంచి కొరియర్స్ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నిందితులు ఎక్సైజ్ శాఖకు తెలిపారు. ఎప్పడు విచారణకు పిలిచినా… హాజరు కావాలని రవితేజ..డ్రైవర్ శ్రీనివాస్ లకు ఈడీ ఆదేశించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా రవితేజ హమీనిచ్చారు.