గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు కన్నుమూస్తున్నారు. ఈ మరణాలతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు కూడ దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. తాజాగా దర్శకులు మారుతి ఇంటి విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో కామెడీ చిత్రాలు తెరకెక్కించిన దర్శకులు మారుతి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకులు మారుతీ తండ్రి దాసరి వన కుచల రావు కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. మచిలీపట్నంలోని తన స్వగృహంలో దర్శకులు మారుతీ తండ్రి దాసరి వన కుచల రావు చివరి శ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.