విపత్కర పరిస్థితుల్లో సాయం చేయడానికి ఎంతో మంది మంచి మనస్సుతో ముందుకు వస్తుంటారు. కరోనా సమయంలో కూడా చాలా మంది ప్రముఖులు పేదవారికి సాయం చేసి ఆదుకున్నారు. సినీ ప్రముఖులు సైతం కరోనా కాలంలో పేదవారికి ఎంతో సాయం చేశారు. అలానే ఇతర విపత్కర సమయాల్లో కూడ విరాళాలు, ఇతర సామాగ్రి అందిస్తూ.. తమ మంచి హృదయాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు నటుడు ఉత్తేజ్ ఒకరు.
తన భార్యతో కలసి కరోనా సమయం ఎంతో మందికి భోజనాలు పెట్టి.. ఉత్తేజ్ వారి ఆకలి తీర్చారు . అమ్మ, భార్య ఇచ్చిన స్ఫూర్తితో ఉత్తేజ్ అలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఎండాలంలో చాలా మంది పాదాచారులు నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ఉత్తేజ్.. పాదాచారుల కోసం చల్లివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. “మా అమ్మ ఎపుడైనా ఊరు వెళ్లాల్సి వస్తే నీళ్లు పోసి పెట్టండని పక్కింటి వాళ్ళకి చెప్పి వచ్చేది. అదే అలవాటు రక్తానుగతంగా నాకూ అబ్బింది. నా అదృష్టం మా పద్మకి కూడా తోటి మనిషికి సహాయం చేయడం, మనుషుల్ని పట్టించుకోవడం లాంటి మంచి లక్షణాలు ఉన్నాయి.
ఇంటికి ఎవరైనా రాగానే మంచినీళ్లివ్వడం, భోజనం టైం కి వస్తే ఖచ్చితంగా భోజనం పెట్టి పంపించడం తనకి అలవాటు. అంతే. పద్మని మిస్ అయ్యాక ఇంటి వాతావరణం మిస్ అయ్యి కుటుంబ వ్యవస్థ పోవడం బాధగా ఉంది. అందుకే పద్మ మంచిపనుల పరంపరని కొనసాగిస్తూ.. ఈరోజు మంచినీళ్లు అందించే మంచిపని మొదలెట్టాను. ఈ కార్యక్రమం విజయవంతగా కొనసాగించడంలో రాజు, మహేంద్ర, వంశీ సహాయం మరువలేనివి. థ్యాక్ యూ పద్మ.. నాతో ఓ మంచిపనికి శ్రీకారం చుట్టించావు. లవ్ యూ ఆల్” అంటూ ఉత్తేజ్ పేర్కొన్నాడు. మరి.. నటుడు ఉత్తేజ్ చేపట్టిన ఈ మంచి కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.