ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఓటిటి ప్లాట్ ఫామ్స్ వెలుగులోకి వచ్చాక రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య పెరిగిపోయిందని చెప్పాలి. ఇదివరకు ఓటిటిలు లేనప్పుడంటే ఎక్కువగా సినిమాలు థియేటర్లలో చూసేవారు. ఎప్పుడైతే ఓటిటిలు వచ్చాయో.. అప్పటినుండి సినిమాలు, వెబ్ సిరీస్ లు రెండూ రెగ్యులర్ గా రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవ్వాల్సిన సినిమాల సంఖ్య పెరిగేసరికి ఓటిటిలకు కూడా డిమాండ్ పెరిగింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలలో ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చేశాయి. వాటికి అనుగుణంగానే ప్రతి వారం రిలీజ్ అవుతున్న సినిమాలు/సిరీస్ లు పదుల సంఖ్యలలో స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్నాయి.
ఇక ఓటిటిలు వచ్చాక థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది అనేది ఓవైపు వాదన. మరోవైపు ఓటిటిలు వచ్చాకే కొన్ని కేటగిరిలకు సంబంధించి సినిమాలకు న్యాయం జరుగుతుందని మరో వాదన. ఈ నేపథ్యంలో వారానికి ఇరవై సినిమాల వరకు రిలీజ్ అవుతుండగా.. అంటే.. నెలకు దాదాపు 60 – 70 సినిమాలు ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. అదీగాక ఈ మధ్య థియేట్రికల్ సినిమాలన్నీ నెల రోజుల్లోనే ఓటిటి బాటపడుతున్నాయి. సో.. ఈ వారం సుమారు పదికి పైగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. మరి ఈ వారం ఏయే ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో ఏమేం సినిమాలు రానున్నాయో చూద్దాం!