సూపర్ స్టార్ మహేష్ బాబు ఎత్తుకున్న ఈ చిన్నారి.. మూడేళ్ళ వయసులోనే నటించడం ప్రారంభించింది. పలు తెలుగు సీరియల్స్‌లో కూడా నటించింది. ఏడేళ్ళ వయసులో సినిమాల్లో అడుగుపెట్టింది. 2000వ సంవత్సరంలో అర్జున్, జగపతిబాబు హీరోలుగా.. స్నేహ, లయ హీరోయిన్స్‌గా వచ్చిన హనుమాన్ జంక్షన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. అదే ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2003లో రవితేజ హీరోగా వచ్చిన వీడే సినిమాలో నటించి ఇక చదువులపై దృష్టి సారించింది. కట్ చేస్తే 2010లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది. కార్తీ, శివ కార్తికేయన్, జి.వి. ప్రకాష్ కుమార్ వంటి హీరోల సరసన నటించింది.
ఆమె మరెవరో కాదు, శ్రీ దివ్య. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మనసారా’ సినిమాతో తెలుగు తెరపై పరిచయం అయిన పదహరణాల అచ్చ తెలుగు అమ్మాయి శ్రీ దివ్య. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ యువ హీరోయిన్ మారుతీ డైరెక్షన్‌లో వచ్చిన బస్ స్టాప్ సినిమాతో హీరోయిన్‌గా మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, వారధి, కేరింత వంటి సినిమాల్లో నటించారు. ఒక వైపు తెలుగులో చేస్తూనే, మరో వైపు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వచ్చారు. కేరింత తర్వాత ఆమె పూర్తిగా తమిళ సినిమాల మీదనే దృష్టి సారించారు. జి.వి. ప్రకాష్ కుమార్ నటించిన పెన్సిల్, కార్తీ నటించిన కాష్మోరా వంటి సినిమాల్లో నటించారు.
అయితే ఇవేమీ ఆమెని ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌ను చేయలేకపోయాయి. దీంతో ఆమె ఐదేళ్ళ పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఈమెకు జనగణమన అనే మలయాళ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజైన ఈ మూవీలో అతిధి పాత్రలో నటించారు. మలయాళ దర్శకులు అవకాశాలిస్తారేమో అని ఎదురుచూస్తున్నారు. కాగా యువరాజు సినిమాలో మహి, చిన్ననాటి శ్రీ దివ్యను ఎత్తుకున్న ఫోటోను, ప్రస్తుతం వయసులో ఉన్న ఫోటోతో జత చేసి “అప్పుడు అలా, ఇప్పుడు ఇలా” అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మహితో చేసిన శ్రీ దివ్య పెద్దదై హీరోయిన్ అయిపోగా.. మహి మాత్రం ఇంకా యంగ్‌గా కనిపిస్తుండడం మాత్రం ఆశ్చర్యమే. శ్రీ దివ్య మాహిష్మతి సామ్రాజ్యంలో దేవసేనలా ముదిరిపోయినా.. మహి మాత్రం ఇలా ఏజ్ లెస్‌గానే ఉంటారేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.