మామూలు అమ్మాయి ఫోన్ నంబర్ దొరికితేనే ఒక ఆట ఆడేసుకుంటారు. అలాంటిది హీరోయిన్ ఫోన్ నంబర్ దొరికితే ఇంకేమైనా ఉందా? ప్రతి వాడూ సల్మాన్ ఖాన్ లా ఫీలైపోయేవాడే. అనుష్క నంబర్ అనుకుని కొంతమంది ఆకతాయిలు ఫోన్ చేసి అనుష్క ఉందా అని అడిగేవారట. ఇంకొంతమంది అయితే ఏకంగా షర్ట్ లేకుండా ఉన్న ఫోటోలు పంపేవారట. ఇలా పంపింది ఎవరికో కాదు. ఒక దర్శకుడికి. అనుష్క ఫోన్ నంబర్ కి, దర్శకుడికి సంబంధం ఏంటి అనే కదా మీ డౌటు. అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
అనుష్క ఒక ట్వీట్ షేర్ చేసింది. అందులో ఒక ఫోన్ నంబర్ ఉంది. ఇక నెటిజన్స్ ఊరుకుంటారా? అనుష్క ఫోన్ నంబర్ భలే దొరికిందిరోయ్ అని ఆర్మ్ లు గుద్దేసుకుంటూ.. ఆ నంబర్ కి ఫోన్లు చేయడం, మెసేజులు చేయడం చేసేవారు. సింగిల్ గాళ్ళూ, మింగిల్ గాళ్ళూ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కాంటాక్ట్ సేవ్ చేసుకోవడం, వాట్సాప్ లో మెసేజులు పెట్టడం.. అక్కడితో ఆగకుండా సల్మాన్ ఖాన్ బాడీ అన్నట్టు షర్ట్ విప్పేసి దిగిన ఫోటోలను పంపించడం చేసేవారు. ఏదో పెళ్లి చూపులకి పంపించినట్టు పొలోమని ఫోటోలు పంపించేస్తున్నారు. తీరా చూస్తే ఆ ఫోన్ నంబర్ అనుష్కది కాదు. దర్శకుడు వివేక్ ఆత్రేయది.
మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి వంటి సినిమాలతో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న వివేక్ ఆత్రేయకి అనుష్క ఫోన్ నంబర్ అనుకుని టాప్ లెస్ ఫోటోలు పంపించారట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పుకొచ్చారు. కోవిడ్ సమయంలో తన స్నేహితుడి తండ్రికి సీరియస్ అయ్యింది. పలానా బ్లడ్ గ్రూప్ కి చెందిన రక్తం కోసం వెతకడం కోసం కొత్త సిమ్ కార్డు తీసుకుని.. ఆ నంబర్ తో ఒక పోస్ట్ పెట్టారు. ఎవరైనా రక్తదానం చేసేవారు ఉంటే ఈ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అని పోస్ట్ పెడితే దాన్ని హీరోయిన్ అనుష్క షేర్ చేశారు.
చాలా మంది ఆ నంబర్ ని అనుష్క నంబర్ అనుకుని చాలా మంది ఫోన్లు చేసేవారు. వీడియో కాల్స్ చేసేవారు. షర్ట్ లేకుండా ఉన్న ఫోటోలు పంపించేవారు. నేను చాలా షాక్ అయ్యాను. జనాలు ఇంత దారుణంగా ఉంటారా? అక్కడ పెట్టిన పోస్ట్ కాజ్ ఏంటి? జనాలు చేస్తున్న పనేంటి? హీరోయిన్స్ కి ఇంత నరకం ఉంటుందా? నంబర్ బయటకు వెళ్తే ఇంత దారుణంగా ఉంటారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితుడి తండ్రికి రక్తదాతలు దొరికిన తర్వాత ఫోన్ నంబర్ బ్లాక్ చేసేసినట్లు ఆయన వెల్లడించారు. మరి అనుష్క అనుకుని దర్శకుడి నంబర్ కి కాల్ చేయడం, ఫోటోలు పంపడం, వీడియో కాల్స్ చేయడం పట్ల మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.