ఆదిపురుష్’.. గ్లోబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ.. తన ఫస్ట్ ఫిలిం, అజయ్ దేవ్‌గణ్ 100వ సినిమా ‘తాన్హాజీ’ (ది అన్‌సంగ్ వారియర్) తీసి ప్రశంసలందుకున్న యంగ్ డైరెక్టర్ ఓం రౌత్, అందరికీ తెలిసిన వాల్మీకీ రామాయణానికి తన వెర్షన్‌లో వెండితెర రూపం ఇవ్వాలనుకున్నాడు..
‘ఆదిపురుష్’.. గ్లోబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ.. తన ఫస్ట్ ఫిలిం, అజయ్ దేవ్‌గణ్ 100వ సినిమా ‘తాన్హాజీ’ (ది అన్‌సంగ్ వారియర్) తీసి ప్రశంసలందుకున్న యంగ్ డైరెక్టర్ ఓం రౌత్, అందరికీ తెలిసిన వాల్మీకీ రామాయణానికి తన వెర్షన్‌లో వెండితెర రూపం ఇవ్వాలనుకున్నాడు.. ఈ జెనరేషన్‌కి కనెక్ట్ కావడానికి, వారికి మన పురాణాల గొప్పదనం తెలియజేయడానికి.. సుందర సుమధుర అపురూప అద్భుత దృశ్యకావ్యంగా.. రామాయణం తీస్తున్నానని చెప్పుకొచ్చాడు.. హెవీ స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో.. విజువల్ వండర్‌లా తీర్చిదిద్ది ఉంటాడు అనుకున్నారంతా.. పైగా షూటింగ్ జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేసేశాడు కూడా.. తీరా టీజర్ చూశాక.. ‘అబ్బో, అమీర్ పేట్ గ్రాఫిక్స్’ అంటూ తెగ ట్రోల్ చేసి పడేశారు.. దీంతో కాస్త టైం తీసుకుని.. ఒళ్లు దగ్గర పెట్టుకుని.. టీజర్‌తో వచ్చిన నెగిటివిటీని ట్రైలర్‌తో పోగోట్టేశాడు.. ఇక సినిమా విషయంలో బాగానే జాగ్రత్త పడి ఉంటాడు అనుకున్నారు.. కట్ చేస్తే, డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ఇండస్ట్రీ వారికి కూడా సాలిడ్ షాక్ ఇచ్చాడు..
ప్రీమియర్, ఎర్లీ మార్నింగ్ షోల నుండే నెగిటివ్ టాక్ వచ్చేసింది.. ఫస్ట్‌డే వసూళ్లు అదరిపోయాయి.. ఫస్ట్ వీకెండ్ రూ.300 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైపోయింది.. రిలీజ్ అయ్యి వారం రోజులు కావస్తున్నా కానీ ఇప్పటికీ ఆదిపురుష్ వివాదాలు ఆగట్లేదు.. క్యారెక్టర్ల డిజైనింగ్ దగ్గరి నుండి సీన్స్, డైలాగ్స్, సెట్స్.. ఇలా ప్రతీ విషయంలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న డైలాగులను త్వరలో తీసేస్తామని చెప్పిన రైటర్.. ఆ తర్వాత హనుమంతుడు అసలు దేవుడే కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.. అసలు మేం తీసింది రామాయణమే కాదు అని కవర్ చేసే ప్రయత్నం చేశారు.. రిలీజ్ నాటి నుండి ఆదిపురుష్ గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ విపరీతంగా వస్తున్నాయి.. ఇక ఓం రౌత్ చరిత్రను వక్రీకరిస్తూ.. దాన్ని సినిమాగా తెరకెక్కించే క్రమంలో 10 ఘోరమైన తప్పిదాలు చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఆదిపురుష్ మూవీలో ఓం చేసిన పది బ్లండర్ మిస్టేక్స్ ఇవే..
1) రావణాసురుడు.. రామ లక్ష్మణుల ఎదుటే సీతను ఎత్తుకెళ్లినట్టు చూపించాడు దర్శకుడు.. ఇది మామూలు బ్లండర్ కాదు.. రాముడి ముందే
సీతను తీసుకెళ్తే అప్పుడాయన ధైర్యం, శక్తి, తెగువ అలాగే సీతమ్మ మీద ప్రేమ ఏమైనట్లు? అనేది వాల్మీకి రామాయణాన్ని చదివిన వారి ప్రశ్న.. బహుశా దీనికి దర్శకుడి దగ్గర సమాధానం ఉండకపోవచ్చు..
2) సోదరుడు లక్ష్మణుడిని శేషూ అని సంబోధిస్తాడు రాముడు.. లక్ష్మణుడికి పలు పేర్లున్నా కానీ రామాయణంలో ఎక్కడా కూడా శేషూ అనేదే లేదు..
3) రావణుడు, కుబేరుడి దగ్గరి నుండి బంగారం లాక్కున్నాడు.. దీంతో లంక ఎప్పుడూ ధగ ధగ మెరిసిపోతుంటుంది.. మరి ఓం రౌత్ మాత్రం లంకను భూత్ బంగ్లాలా, హాలీవుడ్ సినిమాల సెట్స్ మాదిరిగా చూపించాడు..
4) సీతను దక్కించుకోవడానికి రావణుడు నానా రకాలుగా ప్రయత్నించినా కానీ అతడిని కన్నెత్తి చూడలేదు కదా గడ్డిపోచని చూసినట్టే చూసింది.. గడ్డిపోచతోనే మాట్లాడింది.. అలాంటిది సీత, రావణుల మధ్య ముఖాముఖి డైలాగులు పెట్టడం ఏంటో మరి..
5)వనవాసానికి వెళ్లే ముందు రాముని అవతారంలో ప్రభాస్ ను చూపించిన విధానం.. ఓ మత పరమైన విమర్శలకు దారి తీసింది.
6) ఎంత సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కానీ రాముడు, సీత వస్త్రధారణ విషయంలోనూ పొరపాట్లు చేశాడంటే దర్శకుడిని ఏమనాలి? పాటు శివభక్తుడైన రావణుడి నుదుట బొట్టు ఉండదు.. మండోదరిని విధవగా చూపించడం ఏంటో మరి..
7) రామాయణంలో లేని మరో అద్భుతాన్ని ఆవిష్కరిద్దామనుకుని ఆంజనేయుడు – కుంభకర్ణుడికి మధ్య బీభత్సమైన యుద్ధం పెట్టాడు.. ఇద్దరు బలవంతులు తలపడితే ఎలా ఉంటుందోనని చూపించాలనుకునేది తన ఉద్దేశం కావొచ్చు కానీ కుంభకర్ణుడు కొడుతుంటే, ఆంజనేయుడు ఎగిరెగిరి పడడం అనేది హనుమంతుని భక్తులకు ఆగ్రహం తెప్పించింది..
8) అసలు హనుమంతుడితో ఊరమాస్ డైలాగులు ఎలా చెప్పాలనిపించిందో మరి.. ఇక భాష మారే కొద్దీ ఆ పదాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు..
9) ఇక రావణుడు సర్పాలతో మసాజ్ చేయించుకోవడం అనేది ఓం రౌత్ క్రియేటివిటీ పిచ్చకు పరాకాష్ట అనుకోవచ్చు..
10) రావణుడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మ.. మామూలు సన్యాసిలా తప్పితే ఎక్కడా బ్రహ్మలా కనిపించడు.. పైగా ‘నేను బ్రహ్మని’ అని ఆయన చేతనే చెప్పించాడంటే.. ఓం ఆ పాత్రను ఎలా తీర్చిదిద్దాడో అర్థం అవుతుంది..