కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్.. ఇటీవలే వారి 18 ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధానికి స్వస్తి పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో నోట్ రూపంలో అభిమానులకు తెలియజేశారు. ఈ జంట తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులకు అసంతృప్తి కలిగినప్పటికీ, అయ్యిందేదో అయిపోయిందంటూ సర్దిచెప్పుకోక తప్పదు అంటున్నారు. ఇన్నేళ్లుగా మంచి స్నేహితులుగా, దంపతులుగా, పేరెంట్స్ గా కలిసి బతికి ఇప్పుడు విడాకులు తీసుకోనున్నాము. మా ఇద్దరి నిర్ణయాన్ని గౌరవించాలంటూ ధనుష్, ఐశ్వర్య కోరడం జరిగింది.
వివాదాలకు తావివ్వకుండా జీవించిన ఈ జంట ఒక్కసారిగా విడాకులు ప్రకటించే సరికి కారణం ఇవేనంటూ అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో ధనుష్ నిర్మించిన ‘కాలా’ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కారణంగా భారీగా నష్టపోయిన ధనుష్ ని మామ రజినీకాంత్ ఆర్థికంగా ఆదుకోకపోవడంతో ధనుష్ బాధపడింది ఓ కారణంగా చెబుతున్నాయి సినీవర్గాలు.
అదీగాక ధనుష్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ తో చనువుగా ఉంటున్నాడని, అది ఐశ్వర్యకి నచ్చక కొంతకాలంగా దూరంగా ఉంటుందని సమాచారం. చాలాకాలంగా భర్త ధనుష్ ఎఫైర్లను భరించిన ఐశ్వర్య చేసేదేమిలేక విడిపోయేందుకు సన్నద్ధం అయినట్లు మరో కారణంగా తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక విడిపోయే ముందు ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ రజినీకి కాల్ చేసి మాట్లాడారని, అందుకు ఆయన కూడా నిర్ణయం మీదే అని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి ఈసారి రజిని ఎందుకు అల్లుడు – కూతురిని ఆపేందుకు ప్రయత్నించలేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక రజినీకాంత్ కూడా ఇంతవరకు కూతురి విడాకులపై స్పందించలేదు. మరి ధనుష్, ఐశ్వర్య విడాకుల నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.