వారు ఇద్దరూ తన ఇంట్లో దొంగతన చేశారని తెలిసినా ఆమె వారిని ఇబ్బంది పెట్టలేదు. పైగా వారిపైనే జాలి పడుతోంది. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో వారి గురించి కొన్ని పోస్టులు పెట్టింది..
సాధారణంగా ఇంట్లో దొంగతనం జరిగి డబ్బుపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దొంగలు దొరికితే వారి దగ్గరి నుంచి డబ్బులు వెనక్కు తీసుకునే ప్రయత్నాలు చేస్తాం. నిజం చెప్పాలంటే.. దొంగతనం చేసిన వారిని గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించాలని అనుకుంటాం. కానీ, ప్రముఖ నటి వినోదినీ వైద్యనాథన్ మాత్రం తన ఇంట్లో దొంగతనం చేసిన వారిపై జాలి చూపిస్తోంది. తన డబ్బు తిరిగిరాకపోయినా పర్వాలేదు అనుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నటి వినోదినీ వైద్యనాథన్ ఇంట్లో కొద్దిరోజుల క్రితం దొంగతనం జరిగింది.
దాదాపు 25 వేల రూపాయలు పోయాయి. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగతనం చేసిన వారిని గుర్తించారు. వారిలో ఒకరు మెకానిక్ కాగా.. మరొకరు హౌస్ పేయింటర్. వాళ్లు ఇద్దరూ తనకు తెలిసిన వాళ్లు కావటంతో వినోదినీ ఆలోచనల్లో పడ్డారు. పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ జరిగింది. వాళ్లు దొంగతనం చేసిన డబ్బుల్ని తిరిగి ఇస్తామని ఒప్పందం చేసుకోవటంతో పోలీసులు విడిచిపెట్టారు. వినోదినీ ఆ దొంగతనం చేసిన ఇద్దరి గురించి తన ట్విటర్ ఖాతాలో కొన్ని వరుస పోస్టులు పెట్టారు.
ఆ వరుస పోస్టుల్లో.. ‘‘ ‘‘ ఇద్దరూ పనులు చేసుకునే వాళ్లే. ఆ మెకానిక్ మాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఆ పేయింటర్ సొంతంగా ఓ కాంట్రాక్ట్ పట్టుకుని పని చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి మనుషులు తిండి, పని గురించే ఆలోచిస్తారు. ఇలా పేదిరకంలో బతికే వాళ్లకు కుటుంబం, పిల్లల కోసం ఏదో చేయాలని ఉంటుంది. ఉన్నత స్థితిలోకి రావటానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. మరి, వాళ్లను దొంగతనం చేసేలా చేస్తున్నది ఏంటి?.. ప్రస్తుత రోజుల్లోని పరిస్థితులే వారిని దొంగతనం చేసేలా ప్రేరేపిస్తున్నాయి.
చెన్నైలాంటి నగరాల్లో ఓ పేద కుటుంబం బతకాలన్నా.. 20-25 వేల రూపాయలు కావాలి. ఈ నేపథ్యంలోనే చాలా మంది పేదలు మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో తిండి కోసం ఎదుటి వ్యక్తిని చంపే రోజులు వస్తాయి. అదే గనుక జరిగితే.. అందులోనూ ఓ మంచి ఉంది. ఆ సమయంలో కులం, మతం ప్రాంతం అన్న భావాలు పోతాయి’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, వినోదిని మంచి తనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
சென்ற வாரம் என்னிடமிருந்து 2 நபர்கள் மொத்தம் 25000 ரூ திருடிவிட்டனர். (தனித்தனியே நடந்த இரு சம்பவங்கள்). இருவர் மீதும் போலீஸ் கம்ப்ளையிண்ட் தரப்பட்டு இந்த வாரத்திற்குள் பணத்தைத் திரும்பத் தருவதாக வாக்கு கொடுத்திருக்கிறார்கள். ஆனால் எனக்கு நம்பிக்கையில்லை. அவர்கள் இருவரும்…
— Vinodhini Vaidynathan (@VinodhiniUnoffl) April 18, 2023