తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో టాలీవుడ్ ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో రానున్న ‘ది వారియర్’ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్‌లో రామ్ పవర్ ఫుల్, మాస్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టాడు. అలాగే ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి అంతే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లా ఉంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఊర మాస్‌గా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అలాగే ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి, రామ్ మధ్య మంచి రొమాంటిక్ లవ్‌స్టోరీని మూవీ చూసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో నదియా రామ్ తల్లిగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా జూలై 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా విడుదల చేస్తున్నారు. మరి ఈ ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.