బాహుబలి.. తెలుగు చిత్ర సీమలో సరికొత్త రికార్డును నెలకొలిపి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందీ సినిమా. రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అవార్డులు, రివార్డులను అందుకుంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, రమ్యక్రిష్ణ, అనుష్క తదితరులు నటించారు.
ఇక విషయం ఏంటంటే..? ఈ మూవీలో విలన్ ల పేర్లు చెప్పగానే కాలకేయ ప్రభాకర్ పేరు టక్కున గుర్తుకు వస్తుంది. అయితే ఈయనతో పాటు విలన్ పాత్రలో నటించాడు నటుడు జాన్ కొక్కెన్. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన ఈయన మంచి నటుడిగా గుర్తింపును పొందాడు. కానీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులకెక్కిన బాహుబలి సినిమాలో జాన్ కొక్కెన్ కు మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు.
ఇక ఇటీవల ఓ నెటిజన్ బాహుబలి సినిమాలోని జాన్ కొక్కెన్ పోస్టర్ ను పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్టుపై స్పందించిన జాన్ కొక్కెన్ ఈ మూవీతో నాకు ఏం ఒరిగిందేం లేదని, నా పేరు కూడా ఎవరికి తెలియదంటూ తెలిపాడు. ఇక తర్వాత వచ్చిన సినిమాల నుంచి మంచి పాత్రల్లో అవకాశం వచ్చిందని తెలిపాడు. ఇక జాన్ కొక్కెన్ సార్పట్ట అనే మూవీలో ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు.