టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా హీరోగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ లో నూటయాభై సినిమాలు చేయడంమంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ కి సాధ్యమైంది.. కానీ, ఈ తరంలో ఎవ్వరూ 50 సినిమాలు కూడా రేర్ గా చేస్తున్నారు. అయితే.. ఇన్నేళ్లపాటు మెగాస్టార్ ని హీరోగా చూసినవారంతా ‘లాల్ సింగ్ చడ్డా‘ సినిమా ద్వారా సమర్పకుడిగా చూడబోతున్నారు. ఎందుకంటే.. కెరీర్ లో చిరంజీవి ఓ సినిమాను సమర్పించడం అనేది ఇదే మొదటిసారి.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ ఆగష్టు 11న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 1994 హాలీవుడ్ కామెడీ డ్రామా ‘ఫారెస్ట్ గంప్’ మూవీకి ఇది అధికారిక రీమేక్. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కింగ్ నాగార్జున.. ఆమిర్ ఖాన్, చిరంజీవి, నాగ చైతన్యలను ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఎన్నడూ లేనిది చిరంజీవి లాల్ సింగ్ చడ్డా మూవీని సమర్పించడానికి కారణం ఏంటనేది రివీల్ చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా.. నలభై సినీ కెరీర్ లో ఎప్పుడూ చిరంజీవి ఓ సినిమాను ప్రెజెంట్ చేయడమనేది చూడలేదు. ఈ సినిమాను ఎందుకు తీసుకున్నారు? అని చిరుని నాగ్ అడిగారు. ఈ విషయంపై స్పందించిన చిరు.. “లాల్ సింగ్ చడ్డాకి తనకు మూడేళ్లుగా సంబంధం ఉందని చెప్పారు. అలాగే మూడేళ్ళ కిందట ఆమిర్ ఖాన్.. 2019లో ఓ ఎయిర్ పోర్టులో కలిసినప్పుడు ఈ సినిమా గురించి చెప్పాడు. తాను ఫారెస్ట్ గంప్ రీమేక్ రైట్స్ తీసుకున్నానని.. అప్పుడే అనుకున్నాను ఆమిర్ అయితేనే ఈ సినిమాకు న్యాయం చేయగలడని.. ఆ విధంగా ఇప్పుడు సినిమాను ప్రెజెంట్ చేస్తున్నట్లు చెప్పారు చిరు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి లాల్ సింగ్ చడ్డా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.