పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ పేరు వెనుక ఎన్నో వైబ్రేషన్ లు దాగి ఉన్నాయి. ఈయన పేరు చెబితే చాలు యావత్ దక్షిణాది వ్యాప్తంగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పేరును లిఖించుకున్న పవన్ కళ్యాణ్ తెలుగు హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. కాగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా..తనదైన మార్గంలో దూసుకెళ్తూ ఓ వేదికను ఏర్పరుచుకున్నారనే చెప్పాలి.
ఇక అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లోనూ తన సత్తాను చాటుతున్నాడు పవన్ కళ్యాణ్. దీంతో నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావటంతో ఆయనకు పలువురు సినీ అభిమానులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే..? పవన్ కు పేరు ముందు పవర్ స్టార్ బిరుదు ఎవరు పెట్టారు? ఎలా ఎలా వచ్చిందని పవన్ ఫ్యాన్స్ లో చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నో వైబ్రేషన్స్ దాగి ఉన్న ఈ బిరుదలో అసలు ఎవరు పెట్టారనే ప్రశ్నలు దూసుకువస్తున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత గోకులంలో సీత అనే మూవీలో నటించి మెప్పించాడు పవన్. ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించటంతో మూవీ యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సినిమాకు పోసాని కృష్ణమురళి మాటలు అందించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదును పరిచయం చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత అనే మూవీలో పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అనే బిరుదుతో టైటిల్ కార్డు వేయటం జరిగింది. ఇక అక్కడి నుంచి వార్త పత్రికలు పవన్ పేరుకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని వాడటం జరుగుతోంది.