ప్రపంచంలో ఎలాంటి విపత్తు జరిగినా జనాలంతా ఈ మధ్యన జాగ్రత్త పడటంతో పాటు.. ఇదివరకే ఆ టాపిక్ పై ఏదైనా సినిమా వచ్చిందేమో అని గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెడుతున్నారు. వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం. ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియెంట్ పై ఆల్రెడీ గతంలోనే సినిమా వచ్చిందనే ప్రచారాలు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఓమిక్రాన్ పేరు వైరల్ అవుతుండటంతో ఓమిక్రాన్ పై సినిమా చర్చలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా నెట్టింట సెర్చ్ చేసిన టాప్ 10 టాపిక్స్ లో ఓమిక్రాన్ ఒకటి. అయితే ఓమిక్రాన్ పేరుతో ఆల్రెడీ సినిమా రావడం విశేషం.
1963లో ఓమిక్రాన్ అనే ఇటాలియన్ సై-ఫై డ్రామా మూవీ విడుదలైంది. ఈ సినిమా కథ.. ఏలియన్ బాడీస్నాచర్స్ చుట్టూ తిరుగుతుంది. కానీ పాండెమిక్స్ గురించి కాదు. మరి ఎందుకని సినిమా టైటిల్ వైరల్ అయిందంటే.. ఐర్లాండ్ దేశానికి చెందిన లేడీ డైరెక్టర్ బెక్కీ చీట్లే ఈ సై-ఫై మూవీ టైటిల్ వేరేలా ఉపయోగించింది. ‘ది ఒమిక్రాన్ వేరియెంట్’ పేరుతో సినిమా పోస్టర్స్ చేయించి.. ‘ది డే ది ఎర్త్ వాజ్ టర్న్‌డ్ ఇన్‌టు ఏ సిమెట్రీ’ (భూమి మొత్తం శ్మశానంగా మారిన రోజు) అనే క్యాప్షన్ తో రిలీజ్ చేసింది. కానీ ఆమె సినిమా తీయలేదు. పోస్టర్స్ చూసి జనాలంతా సినిమా తీసిందా? ఆ టైంలోనే డైరెక్టర్ ఈ పరిస్థిని ఉహించిందా.. అంటూ నెట్టింట హల్చల్ చేసేసారు.
అదీగాక స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ లాంటివారు ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్స్ పోస్ట్ చేయడం వైరల్ అవ్వడానికి కారణం. అయితే సోషల్ మీడియాలో పోస్టర్స్ విపరీతంగా వైరల్ అవ్వడంతో డైరెక్టర్ బెక్కీ చీట్లే స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఆ పోస్టర్స్ ఊరికే ఎడిట్ చేయించానని.. ఎలాంటి భయాలు అక్కర్లేదని ఆమె సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఈ ఓమిక్రాన్ వేరియెంట్ పోస్టర్స్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలుపగలరు.