రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే. దీంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ అంటూ ఓ ఫొటో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు మంగళవారం కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. తన మనువరాలిని చూసి చిరు మురిసిపోయారు. అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత అల్లు అర్జున్, ఆయన సతీమణి, వరుణ్ తేజ్, నిహారిక ఆస్పత్రికి చేరుకుని మెగా ప్రిన్సెస్ ని చూసి రామ్ చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక చరణ్ కు కూతురు పుట్టిన నేపథ్యంలో మెగా అభిమానులు అంతా నేరుగా అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెబుతూ నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే నిన్నటి నుంచి మెగా ప్రిన్సెస్ అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ ఫొటో చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీకి చెందిన కొందరు సన్నిహితులు ఈ ఫొటో లీక్ పై స్పందించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఆ ఫోటోలు నిజం కాదని, అసలైన మెగా ప్రిన్సెస్ ఫొటోను త్వరలో సోషల్ మీడియా వేదికగా అందరికీ పరచయం చేస్తారని తెలిపినట్లు సమాచారం. మెగాస్టార్ లేదా చరణ్ మెగా ప్రిన్సెస్ ఫొటోను విడుదల చేయనున్నారని సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తుంది.