సినిమాలో నటిస్తే ట్రెండింగ్ లో వస్తారా అంటే కష్టమే. కానీ దాన్ని రియాలిటీ చేసి చూపించింది ఈ ముద్దుగుమ్మ. ఒకే ఒక్క సినిమాతో ఆలోవర్ ఇండియా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఎవరో గుర్తుపట్టారా?
ట్రెండింగ్ లో ఉండాలని ప్రతి ఒక్క సెలబ్రిటీ కోరుకుంటారు. కాకపోతే ఎప్పుడూ అంటే కష్టం. ఒక్కో టైంలో ఒక్కొక్కరికీ ఈ ఛాన్స్ దక్కుతుంది. అలా ప్రస్తుతం మన దేశమంతా కూడా ఈ బ్యూటీ గురించి మాట్లాడుకుంటోంది. దాదాపు 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. రీసెంట్ గా ఒకే ఒక్క మూవీతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. వరసపెట్టి మూవీ ఛాన్సులు కూడా వచ్చేస్తున్నాయి. తెలుగులోనూ చాలా సినిమాలు చేసిన ఆ భామ ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈమె చూడటానికి నార్త్ అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ మూలాలు మాత్రం సౌత్ లో ఉన్నాయి. ఎందుకంటే తండ్రిది తమిళనాడు, అమ్మది కేరళ. పుట్టి పెరిగింది మాత్రం ముంబయిలో. సో అలా అన్ని సంస్కృతులు అలవాటు అయిపోయాయి. ఆమెనే అదాశర్మ. అదేనండి పూరీ జగన్నాథ్-నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’లో హీరోయిన్ గా చేసింది. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప ఈ బ్యూటీనే. కెరీర్ అంతా నార్మల్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది. దానికి ఓ మూవీ కారణమైంది.
సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ల ముందు ‘ద కశ్మీర్ ఫైల్స్’ అలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు దాన్నే తలదన్నేలా వచ్చిన మూవీ ‘ద కేరళ స్టోరీ’. లవ్ జిహాద్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మధ్య పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఇందులో అదాశర్మ హీరోయిన్ కావడం, ఆమెకు ఫుల్ పాపులారిటీ తీసుకొచ్చింది. దీంతో ఈమె గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అలా బయటకొచ్చిందే ఈ చిన్నప్పటి ఫొటో. మరి దీన్ని చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.