ఇటీవల కొన్ని సినిమాలు వివాదాలతోనే సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నాయి. వివాదం ఉందంటే సినిమాను అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. గతంతో పోల్చితే.. వాస్తవం ఎలా ఉన్నా సినిమా నచ్చితే చాలు నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అటువంటి సినిమాల్లో ఒకటి ది కేరళ స్టోరీ. అయితే ..
ఇటీవల కొన్ని సినిమాలు వివాదాలతోనే సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నాయి. వివాదం ఉందంటే సినిమాను అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. గతంతో పోల్చితే.. వాస్తవం ఎలా ఉన్నా సినిమా నచ్చితే చాలు నెత్తి మీద పెట్టుకుంటున్నారు. నచ్చలేదా.. ఒక్క రోజు షోతోనే ఆ సినిమాను ఇంటికి పంపేస్తున్నారు. ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యి బంఫర్ హిట్ కొట్టిన సినిమా అర్జున్ రెడ్డి. సినిమా కోణాన్ని మార్చిన సినిమా. ఈ సినిమా ఎంతటి వివాదాన్ని కొని తెచ్చుకుందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాను అభిమానులు ఆదరించి. విజయ్ దేవర కొండకు రౌడీ బాయ్ అనే నామకరణం చేశారు. అలాగే ఇటీవల వివాదాస్పదమైన సినిమా ‘ది కేరళ స్టోరీ‘. ఎన్నో అడ్డంకులు, నిషేధాలు ఎదుర్కొని థియేటర్లలో విడుదలైంది. అయితే ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో రూ. 200 కోట్లు కొల్లగొట్టింది.
ఆ ఆనందంలో ఉండగానే… ఈ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ అస్వస్థతకు గురయ్యారు. ఈ సినిమాను ప్రమోషన్లలో భాగంగా సుదీప్తో సేన్ అనేక ప్రాంతాలను చుట్టి వచ్చారు. సుదీప్తో సేన్ బృందంతో కలిసి ‘కేరళ స్టోరీ’ని ప్రచారం చేస్తూ నిరంతరం ప్రయాణిస్తున్నాడు. విపరీతమైన ప్రయాణాల కారణంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. దీంతో పలు నగరాల్లో షెడ్యూల్ లో ఉన్న మూవీ ప్రమోషన్లు నిలిచిపోయాయి. సుదీప్తో సేన్ కోలుకున్న తర్వాత 10 నగరాల్లో ‘కేరళ స్టోరీ’ని ప్రచారం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ప్రచార ప్రణాళిక, నగర సందర్శనలు నిలిపివేయబడ్డాయని నివేదికలు చెబుతున్నాయి.సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసి, విపుల్ షా నిర్మించిన ఈ సినిమాల అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్వానీ నటించారు.