సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా వేధింపులు తప్పడం లేదు. తాజాగా కేరళ స్టోరీ నటికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఆ వివరాలు..
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల అదా శర్మ. కూట్య్ ఫేస్, బ్యూటీఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్లకి నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించింది అదా శర్మ. ఆ సినిమా ఏవరేజ్‌గా ఆడింది. ఆ తర్వాత అదా శర్మకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమాల సంగతి తెలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటుంది అదా శర్మ. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇన్నేళ్లుగా డల్‌గా సాగుతున్న అదా శర్మకు.. ది కేరళ స్టోరీ సినిమా.. మంచి బూస్టింగ్ ఇచ్చింది అని చెప్పవచ్చు.
మత మార్పిడిల అంశం ఆధారంగా తెరకెక్కిన ది కేరళ స్టోరీ చిత్రం.. ఇండియాలో భారీ విజయం సాధించింది. కొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా మీదే జోరుగా చర్చలు సాగాయి. చాలా మంది సినిమా ప్రదర్శనను ఆపాలంటూ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ ఈ వివాదాలేవి కేరళ స్టోరీ విజయాన్ని ఆపలేకపోయాయి. ఈ చిత్రంలో అదా శర్మ నటనపై ప్రశంసలు కురిపించారు. ప్రసుత్తం ఈ బ్యూటీ కేరళ స్టోరీ సాధించిన భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ నెటిజన్.. అదా శర్మకు ఊహించని షాకిచ్చాడు. ఆమె వ్యక్తిగత వివరాలు నెట్టింట లీక్ చేసి.. ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. ఆ వివరాలు..
పేరు తెలియని యూజర్ ఒకరు.. అదా శర్మ వ్యక్తిగత వివరాలను.. సోషల్ మీడియాలో లీక్ చేశాడు. దాంతో అదా శర్మకు వేధింపులు ఎక్కువయ్యాయ. అంతేకాక సదరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను వెంటనే డీయాక్టివేట్ చస్త్రశారు. అంతేకాక ఆమె కొత్త కాంటాక్ట్ నంబర్‌ను కూడా లీక్ చేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. దీనిపై అదా శర్మ పోలీసులను ఆశ్రయించేందుకు రెడీ అవుతోందట. ఇదిలా ఉండగా.. కొన్నిరోజుల క్రితం అదా శర్మ.. ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ యాక్సిడెంట్‌లో ‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్ కూడా గాయపడినట్లు వార్తలు వెలువడ్డాయి.
నిజానికి ‘ది కేరళ స్టోరీ’ టీమ్.. కరీంనగర్‌లో జరిగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనాల్సి ఉంది. కానీ రోడ్డు ప్రమాదం జరగడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఆదా శర్మ సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య విషయాలను షేర్ చేసింది. తాను క్షేమంగానే ఉన్నానని.. తన గురించి ఆందోళన పడవద్దని అభిమానులను కోరింది.